కుంబ్లేను అవమానించడమే: బోర్డు తీరుపై లోధా కమిటీ
హైదరాబాద్: టీమిండియాకు కొత్త కోచ్ నియామక ప్రక్రియపై బీసీసీఐ వ్వవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మాజీ క్రికెటర్లు పలువురు బోర్డు వైఖరిని తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కోచ్ ఎంపికపై బీసీసీఐ అనుసరిస్తున్న తీరుపై లోధా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏడాది కాలంగా కుంబ్లే చక్కని పనితీరును చూసి అతని పదవీకాలం పెంచాల్సిందిగా లోధా కమిటీ అభిప్రాయపడింది. అంతేకాదు ప్రస్తుత హెడ్ కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లేను తప్పించి మరొకరిని నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందని లోధా కమిటీ కార్యదర్శి గోపాల్ శంకరనారాయణ్ ప్రశ్నించాడు.
భారత క్రికెట్ జట్టులో ఎంతో ముఖ్యమైన కోచ్ పదవిని ఏడాదికే పరిమితం చేయడం ఎంతమాత్రం సరికాదని ఆయన అన్నారు. క్రికెట్‌లో పారదర్శకత అనేది ముఖ్యమని, ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

లోధా కమిటీ సిఫార్సులకు ఇది పూర్తి విరుద్ధం
'జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులకు ఇది పూర్తి విరుద్ధం. బోర్డు అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారు. అలాంటి వ్యక్తులు కోచ్ లు, ఆటగాళ్ల కాంట్రాక్టులను నిర్ణయించడం శోచనీయం. ప్రస్తుతం జాతీయ క్రికెట్ కోచ్‌కు దరఖాస్తుల్ని ఎందుకు కోరాల్సి వచ్చిందో అర్దం కావడం లేదు' అని గోపాల్ శంకరనారాయణ్ పేర్కొన్నారు.

కుంబ్లేను ఏడాదికే పరిమితం చేసి
కుంబ్లేను ఏడాదికే పరిమితం చేసి కోచ్ కోసం కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించడం తగదు. కోచ్‌గా విజయవంతమైన కుంబ్లే పదవీ కాలాన్ని ఎందుకు పొడిగించడం లేదు. ఒక జాతీయ కోచ్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా. ఏడాదిపాటు కోచ్‌ను నియమించడం ఎంతవరకూ కరెక్ట్. ఇది జాతీయ జట్టు చీఫ్ కోచ్‌ను ఓ రకంగా అవమానించడమే' అని అన్నారు.

ఏడాదికోసారి కోచ్‌లను మార్చుకుంటూ పోతే ఎలా
'ఇలా ఏడాదికోసారి కోచ్‌లను మార్చుకుంటూ పోతే జట్టుకు ఎలాంటి లాభం జరుగదు. బోర్డు సభ్యుల నిర్ణయంతో ఇదంతా జరుగుతున్నది. ఇప్పటికైనా ఏడాదికో కోచ్ గాకుండా కొత్త కాంట్రాక్టు కాలపరిమితిని మరింత పొడిగిస్తే బాగుంటుంది' అని శంకరనారాయణ్ అన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం టీమిండియాకు కొత్త కోచ్
గతేడాది కుంబ్లే ను భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత హెడ్ కోచ్‌గా కుంబ్లే పదవీ కాలం ముగియడంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ క్రమంలో కోచ్‌గా కుంబ్లే పదవి కాలాన్ని పొడిగించకుండా కొత్తగా కోచ్ అభ్యర్దికి దరఖాస్తులు కోరడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications