హైదరాబాద్: భారత జట్టు హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే కాంట్రాక్టును బీసీసీఐ పొడిగించనుందా..? అతన్నే కొనసాగించనుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. కుంబ్లేతో పాటు టీమిండియా సహాయక సిబ్బందిని కొనసాగించడంపై చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాతే బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.
గతేడాది వెస్టిండీస్ పర్యటనకు ముందు టీమ్ డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్ర్తి స్థానంలో ఏడాది కాలానికి టీమిండియా చీఫ్ కోచ్‌గా కుంబ్లేని బీసీసీఐ నియమించింది. అయితే ఈ ఏడాది జూన్‌తో అనిల్ కుంబ్లే కాంట్రాక్టు ముగియనుంది. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత కుంబ్లే కాంట్రాక్టును పునరుద్దరించే విషయంపై ఒక నిర్ణయానికి రావాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలిసింది.

'గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కోచ్‌గా కుంబ్లేకు చాంపియన్స్ ట్రోఫీనే ఆఖరి టోర్నీ అవుతుంది. అయితే ఆయనను కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదు. టోర్నీ ముగిసిన తర్వాత జరిగే బోర్డు సర్వసభ్య సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం. అయినా ఈ విషయంలో సీఓఏ అనుమతి కూడా తప్పనిసరి' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
కుంబ్లే కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత వరుసగా ఐదు టెస్టు సిరిస్‌లలో విజయం సాధించింది. టీమిండియా బ్యాటింగ్ కోచ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ ఆర్. శ్రీధర్‌లను చాంపియన ట్రోఫీ వరకూ కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి కాంట్రాక్టులు మార్చిలోనే ముగిశాయి.
అయితే, జూన్ 1 నుంచి 18 వరకు ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో బంగర్, శ్రీధర్‌ల వినియోగించుకోవాలని బోర్డు భావించింది. దీంతో పాటు సెలక్షన్ కమిటీలో ముగ్గురే సభ్యులు ఉండటం పట్ల వస్తున్న సమస్యలను కొన్ని రాష్ట్ర సంఘాలు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ దృష్టికి తీసుకెళ్లాయి.