For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైకి షాక్: చీఫ్ మెంటార్ పదవికి కుంబ్లే రిజైన్

By Nageswara Rao

ముంబై: గత మూడేళ్లుగా ముంబై ఇండియన్స్ జట్టుకు చీఫ్ మెంటార్‌గా వ్వవహరిస్తున్న టీమిండియా స్ఫిన్నర్ అనిల్ కుంబ్లే ఆ పదవి నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలు, క్రికెట్ సంబంధిత విషయాలకు ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుంబ్లే సోమవారం ప్రకటించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 6వ ఎడిషన్‌లో భాగంగా 2013లో అనిల్ కుంబ్లే ముంబై ఇండియన్స్ జట్టు చీఫ్ మెంటర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ ఏడాదే ముంబై ఇండియన్స్ తొలి ఐపీఎల్ టైటిల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్ టీ20ను సైతం కైవసం చేసుకుంది.

Anil Kumble resigns as Chief Mentor of Mumbai Indians

ఆ తర్వాత 2015 సీజన్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవడంలో అనిల్‌ కుంబ్లే కీలక పాత్ర పోషించాడు. కాగా, ముంబై ఇండియన్స్ జట్టు తరుపున ఆకాష్ అంబానీ, అనిల్ కుంబ్లే సేవలను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.

భారత్ తరుపున వన్డేలు, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన కుంబ్లే సేవలను ఇక తమ జట్టు కోల్పోతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+