For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోచ్ ఆఫ్ ద ఇయర్' అవార్డుని అందుకున్న అనిల్ కుంబ్లే

By Nageshwara Rao
Anil Kumble receives “Coach of the Year” award

హైదరాబాద్: టీమిండియా మాజీ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే 'కోచ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు అందుకున్నారు. బెంగళూరులోని తాజ్ వివాంటాలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పోర్ట్స్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ బెంగళూరు (SWAB) కుంబ్లేకి ఈ అవార్డు ప్రకటించింది.

2016, జులై నుంచి మార్చి 2017 వరకు అనిల్ కుంబ్లే టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. కుంబ్లే పర్యవేక్షణలో టీమిండియా వరుసగా ఐదు టెస్టు సిరీస్‌‌ల్లో విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో కుంబ్లేకి ఈ అవార్డునిస్తున్నట్లు SWAB ప్రకటించింది.

భారత మహిళా హాకీ జట్టు కోచ్ హరేందర్ సింగ్ చేతుల మీదుగా సోమవారం ఈ అవార్డుని అనిల్ కుంబ్లే అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న సందర్భంగా అనిల్ కుంబ్లే మాట్లాడుతూ 'అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. ప్రతిభని గుర్తించి ప్రోత్సహించడంలో SWAB ఎప్పుడూ ముందుంటుంది. మీ సహకారం లేకపోతే.. నా క్రికెట్ కెరీర్ ఆరంభంలోనే అవార్డులను దక్కించుకునేవాడిని కాదేమో' అని కుంబ్లే అన్నాడు.

'ఇప్పుడు నా ముందు కూర్చున్న చాలా మంది స్పోర్ట్స్ జర్నలిస్ట్‌లు నాకు సుదీర్ఘకాలంగా తెలుసు. నా స్కూల్ క్రికెట్‌ నుంచి నా కెరీర్ రిటైర్మెంట్.. తర్వాత కోచ్ బాధ్యతలు ఇలా అన్ని సమయాల్లోనూ వారు నా గురించి వార్తలు రాశారు. ఈ మీ ప్రోత్సాహం మరువులేనిది.. ఇకపై కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నా' అని కుంబ్లే భావోద్వేగంతో అన్నాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో నెలకొన్న విభేదాల కారణంగా ఈ ఏడాది జూన్‌లో కోచ్ బాధ్యతల అనిల్ కుంబ్లే తప్పుకున్న సంగతి తెలిసిందే.

అవార్డులు అందుకున్న వారి జాబితా:
Best sportsperson of the year (Male): Sunil Chhetri
Best sportsperson of the year (female): Aditi Ashok
Team of the year: Bengaluru FC
Coach of the year: Anil Kumble
Lifetime Achievement Award: MP Ganesh
Best junior sportsperson of the year (male): Arjun Maini
Best junior sportsperson of the year (female): Damini Gowda
Association of the year: Karnataka Badminton Association
Behind the scenes award: K Sriram

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 18, 2017, 18:15 [IST]
Other articles published on Dec 18, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+