Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుంబ్లే రిటైర్మెంట్: వార్తలు, వదంతులు

Anil Kumble
ముంబై : భారత టెస్టు జట్టు కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే రిటైర్మంట్‌ వార్తలు బుధవారం ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కుంబ్లే తన సహచరుల వద్ద ఈ నిర్ణయం వెలిబుచ్చినట్లు ఎలక్ట్రానిక్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అయితే అనిల్‌ కుంబ్లే ఈ వార్తలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాడు. తాను ఇంకా రిటైర్మెంట్‌ గురించి ఆలోచించలేదని తేల్చి చెప్పాడు. దీనితో సీనియర్ల వరుస రిటైర్మెంట్లపై చెలరేగిన చర్చకు బ్రేక్‌పడింది.

గంగూలీ రిటైర్మంట్‌ ప్రకటన తరువాత పలువురు సీనియర్లు కూడా టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పే అవకాశం ఉన్నదనే వార్తాలు వెలువడ్డాయి. ఈ కోవలో మొదటగా కుంబ్లే పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తరువాత డిసెంబర్‌లో ద్రవిడ్‌, మార్చిలో పాక్‌తో టెస్టు సిరీస్‌ అనంతరం సచిన్‌ రిటైర్మంట్‌ ప్రకటనలు ఖరారయ్యాయని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. సీనియర్లు దీన్ని ఖండించినా, గంగూలీ ప్రకటన ఇందుకు ఊతమిచ్చింది.
Story first published: Wednesday, October 8, 2008, 17:34 [IST]
Other articles published on Oct 8, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+