బౌండరీల లెక్కింపుపై అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ కమిటీ సమీక్ష

న్యూఢిల్లీ: బౌండరీల లెక్కింపుపై భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ కమిటీ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో సమీక్ష జరపనుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్-219 ఫైనల్ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ కూడా టై అయిన నేపథ్యంలో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను ఐసీసీ విజేతగా ప్రకటించింది. దీంతో ఐసీసీ తీసుకున్న బౌండరీల లెక్కపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

బౌండరీల లెక్కింపుపై సమీక్ష:
భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ సహా ఎందరో మరో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. మరికొందరు ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్ నిర్వహించాలని సూచించారు. చాలామంది బౌండరీల లెక్కింపు నిబంధనను సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ కమిటీ బౌండరీలను లెక్కించే నిబంధనను వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో సమీక్షించనుందని ఐసీసీ ఆదివారం తెలిపింది.

అదే పరిగణలోకి తీసుకున్నాం:
ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్‌డైస్ మాట్లాడుతూ... 'ప్రపంచకప్ ఫైనల్ (బౌండరీ కౌంట్) నిబంధనలపై వ్యక్తమైన అభ్యంతరాలను ఐసీసీ కమిటీ తదుపరి సమావేశంలో చర్చించనుంది. మ్యాచ్ టై అయిన సందర్భంలో.. ఫలితం తేల్చడానికి 2009 నుంచి ఐసీసీ టోర్నీల్లో సూపర్ ఓవర్ నిర్వహిస్తున్నాం. సూపర్ ఓవర్ కూడా టై అయితే.. బౌండరీ కౌంట్ పరిగణలోకి తీసుకోవాలనే నిబంధన ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో అదే పరిగణలోకి తీసుకున్నాం' అని అన్నారు.

ప్రత్యామ్నాయం ఉంటే పరిశీలిస్తాం:
'ప్రపంచంలోని అన్ని దేశాల టీ20 లీగ్‌ల్లో బౌండరీ కౌంట్ నిబంధన ఉంది. ప్రొఫెషనల్ క్రికెట్‌లో కూడా ఎక్కువగా అదే నిబంధన ఉన్నందున కొనసాగించాం. దీనికి మరేదైనా ప్రత్యామ్నాయం ఉంటే క్రికెట్ కమిటీ పరిశీస్తుంది. ఫైనల్ మ్యాచ్ టై అయిన సందర్భంలో భవిష్యత్తులో టైటిల్‌ను ఇరు జట్లకు ఇవ్వాలన్న విషయంపై ఐసీసీ వార్షిక సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదు' అని అలార్‌డైస్ స్పష్టం చేశారు. టెస్ట్ చాంపియన్‌షిప్‌ను స్వాగతిస్తున్నామన్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపై హర్షం వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications