For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ సీఎస్కే ఆటగాడికి అభిమానిగా మారిన అనిల్ కుంబ్లే!

IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం తమ కష్టతరమైన సీజన్లలో ఒకదాన్ని ఎదుర్కొంటోంది. కానీ లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే సీఎస్కే జట్టుకు ఉజ్వల భవిష్యత్తు ఉందని నమ్ముతున్నాడు. ఆయన ఆశలు డెవాల్డ్ బ్రెవిస్‌పై ఉన్నాయి. జియో హాట్‌స్టార్‌లో అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. ఈ కష్టతరమైన సీజన్‌లో జట్టుకు దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ ఆశాకిరణంగా ఎదిగాడని అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించాడు.

అనిల్ కుంబ్లే ప్రశంసలు
స్పిన్ బౌలింగ్ చేయగల డెవాల్డ్ బ్రెవిస్ సామర్థ్యం నిజంగా గొప్పదని అనిల్ కుంబ్లే అన్నాడు. చెన్నైలో ఆడటం‌ అంత సులభం కాదన్నాడు. ఇక్కడ రెండు రకాల జట్లు ఉంటాయని.. కొన్ని బంతులు ఆగివస్తాయని చెప్పుకొచ్చాడు. డెవాల్డ్ బ్రెవిస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో, అండర్-19 స్థాయిలో అద్భుతంగా ఆడి ఐపీఎల్‌కు వచ్చాడని అనిల్ కుంబ్లే అన్నాడు. అతను ఇంతకుముందు జట్టులో భాగం కాదని.. ఒకరిని భర్తీ చేయడానికి వచ్చాడని చెప్పాడు. ఇది 2011లో ఆర్సీబీలో క్రిస్ గేల్‌ను గుర్తుచేస్తుందని.. గేల్ కూడా ప్రత్యామ్నాయంగా వచ్చి ఐకాన్‌గా మారాడని అనిల్ కుంబ్లే అన్నాడు.

Anil Kumble Impressed by CSK s Dewald Brevis Calls Him the Future Icon

డెవాల్డ్ బ్రెవిస్‌కు అన్ని షాట్లు ఉన్నాయని కుంబ్లే చెప్పాడు. రచిన్ రవీంద్ర, ఆయుష్ మాత్రే, మతీషా పతిరానాతో సీఎస్కేను ముందుకు తీసుకెళ్లగలిగే యువజట్టును కలిగి ఉందన్నాడు. డెవాల్డ్ బ్రెవిస్ ఫ్రాంచైజీకి ఐకాన్‌గా మారే అవకాశం ఉందని అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. సీఎస్కే జట్టులో ముఖ్యంగా టాపార్డర్‌లో మరింత స్థిరత్వం ఉంటే ఉపయోగకరంగా ఉండేదని అన్నాడు. కానీ ఇప్పుడు ప్లేఆఫ్స్ ఆశలు తగ్గిపోయాయి కాబట్టి భవిష్యత్ గురించి ఆలోచించాలని సీఎస్కేను కోరాడు. ఇప్పుడు 5 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కాబట్టి యువకులకు మంచి అవకాశం ఇచ్చి భవిష్యత్తు కోసం సిద్ధం కావడానికి ఇదే సరైన సమయం అని అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు.

Story first published: Saturday, April 26, 2025, 14:59 [IST]
Other articles published on Apr 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+