Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రవిశాస్త్రి పదవికి ఎసరు.. టీమిండియా డైరెక్టర్ గా కుంబ్లే?

ముంబై: టీమిండియాలో పలు మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇన్నాళ్లూ కోచ్ పదవిలో ఉన్న అనిల్ కుంబ్లేను మార్చి, ఆయన స్థానంలోకి రాహుల్ ద్రవిడ్ ను తీసుకొస్తారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అండర్ 19 జట్టును సమర్ధంగా నడిపించిన ద్రవిడ్.. సీనియర్లకు కూడా పాఠాలు చెప్పగలడన్న నమ్మకంతోనే అతడిని తీసుకొస్తున్నారని భావిస్తున్నారు. మరి ఇప్పటికే మంచి ఫాంలో ఉన్న అనిల్ కుంబ్లేను ఏం చేస్తారనే ప్రశ్నలు ఈ సందర్భంలో తలెత్తాయి.

అయితే కుంబ్లేను కూడా పక్కన పెట్టరని.. ఆయనకు టీం డైరెక్టర్ పదవి అప్పగిస్తారని తాజాగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీని అర్థం.. ఇన్నాళ్లూ ఆ పదవిలో ఉన్న రవిశాస్త్రి కుర్చీ కిందికి నీళ్లు వచ్చినట్లే లెక్క.

Anil Kumble could become Team India director, Rahul Dravid coach: Reports

టీమిండియా డైరెక్టర్గా రవిశాస్త్రి పదవీకాలం దాదాపు ముగ్గుస్తోంది. మరోసారి ఆయనకు పొడిగింపు ఇవ్వకుండా.. ఆయన స్థానంలోకి అనిల్ కుంబ్లేను తీసుకొస్తారని అంటున్నారు. కుంబ్లే కోచింగ్ 2016 సంవత్సరం మొత్తంమీద భారత జట్టు ఒక్క టెస్టు మ్యాచ్ లో కూడా ఓటమి చవి చూడలేదు.

వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇగ్లాండ్, బంగ్లాదేశ్.. ఇలా వరుసపెట్టి అన్ని దేశాలతోనూ సిరీస్లు గెలుచుకుంటూ వచ్చింది టీమిండియా. అలాగే రాహుల్ ద్రవిడ్ కోచింగ్ లో ఇండియా అండర్ 19 జట్టు కూడా చాలా పట్టిష్టంగా తయారైంది. అండర్ 19 జట్టు వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్లింది కూడా.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జట్టు పాలకమండలిని పూర్తిగా మార్చాలన్న ఉద్దేశంలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అనిల్ కుంబ్లేను టీమిండియా డైరెక్టర్ గా నియమిస్తారని, రాహుల్ ద్రవిడ్ ను సీనియర్స్ జట్టుకు కోచ్ గా నియమిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+