Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్విట్టర్ వేదికగా కుంబ్లేకు జన్మదిన శుభాకాంక్షలు

Anil Kumble Celebrates His 48th Birthday
Anil Kumble Birthday: Wishes Pour In As Legendary Spinner Turns 48

న్యూఢిల్లీ: జెంటిల్‌మన్ గేమ్ క్రికెట్‌లో భారత ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన కొద్ది మంది ఆటగాళ్లలో అనిల్ కుంబ్లే ఒకరు. క్రికెటర్‌గా రికార్డ్‌లు క్రియేట్ చేయడం మాత్రమే కాదు. భారత క్రికెట్‌లోనే అత్యంత శాంత స్వభావుడిగా కుంబ్లే పేరు తెచ్చుకున్నారు. టీమిండియా ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్‌గా , టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రను తిరగరాసిన ఘనత కుంబ్లేకే దక్కింది.

సన్నిహితులు అనిల్ కుంబ్లేను జింబో అని పిలుస్తారు. భారత క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన కుంబ్లే 48వ పుట్టినరోజు సందర్భంగా దిగ్గజాల నుంచి సామాన్యుల వరకూ క్రికెట్ ప్రపంచమంతా శుభాకాంక్షలు తెలిపింది.

దిగ్గజాలలో ఒకరైన కుంబ్లేకు హ్యాపియెస్ట్ బర్త్ డే

'భారత క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన అనిల్ కుంబ్లేకు హ్యాపియెస్ట్ బర్త్ డే. ఫేస్ బౌలర్లు సైతం కష్టపడుతున్న తరుణంలో జట్టును గెలిపించే విధంగా బౌలింగ్ చేసిన ఘనత కుంబ్లేది. మీకు చాలా గొప్ప జీవితం కలగాలి' అని కోరుకుంటున్నట్లు వీరేందర్ సెహ్వాగ్ పేర్కొన్నాడు.

స్నేహితుడు.. ఛాంపియన్‌కు శుభాకాంక్షలు

ప్రియమైన స్నేహితుడు.. ఛాంపియన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

సోదరా.. మాకందరికీ నువ్వే ప్రేరణ:

పుట్టినరోజు శుభాకాంక్షలు సోదరా. మాకందరికీ నువ్వే ప్రేరణ. నీ జీవితాంతం నీకు సంతోషం ఉండాలని కోరుకుంటున్నాం.

నీపై ప్రేమ ఎప్పటికీ అలానే

మాకు ఆదర్శనీయమైన వ్యక్తి. సహచరుడు. ప్రేరణ అయిన నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. జీవితమంతా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అనిల్ సోదరా.. నీపై ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది.

నువ్వు చేసే ప్రతీ పనిలోనూ

"కుంబ్లే, నువ్వు చేసే ప్రతీ పనిలోనూ విజయం కలగాలని ఆశిస్తున్నాను" అని వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.

Story first published: Wednesday, October 17, 2018, 15:42 [IST]
Other articles published on Oct 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+