కుంబ్లేపై అసంతృప్తి?: టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ కావలెను
హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అన్వేషణ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే పదవీ కాలం ఈ ఏడాది జూన్‌తో ముగిసిపోతున్న తరుణంలో కొత్త కోచ్ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానించింది. 'పురుషుల క్రికెట్ జట్టు హెచ్ కోచ్ కోసం ఆప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నాం. ఆసక్తిగల అభ్యర్ధులు ఆ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగుస్తుంది. ఆ తర్వాత ఈ ప్రాసెస్ ప్రారంభమవుతుంది' అని బీసీసీఐ తెలిపింది.
ఇంగ్లాండ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసే వరకూ అనిల్ కుంబ్లేనే టీమిండియా హెడ్ కోచ్‌గా ఉంటారు. అయితే ఆ తర్వాత మరొకరికి కొత్తగా బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ యోచిస్తోంది. అదే క్రమంలో కుంబ్లేను టీమిండియా డైరెక్టర్‌గా నియమించాలని చూస్తోంది.

టీమిండియాకు కొత్త కోచ్ కావలెను
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసే లోపు టీమిండియాకు కొత్త కోచ్ నియామకం జరగని తరుణంలో కుంబ్లేనే ఆ బాధ్యతల్లో కొనసాగుతాడని బీసీసీఐ అధికారికంగా తెలిపింది. టీమిండియాకు కొత్త కోచ్ నియామకాన్ని బీసీసీఐ పాలనా కమిటీ(సీఓఏ)తో పాటు ముగ్గురు సభ్యుల క్రికెట్ అడ్వైజరీ కమిటీ పర్యవేక్షించనుంది.

వరుసగా ఐదు టెస్టు సిరిస్‌లలో విజయం
కుంబ్లే కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత వరుసగా ఐదు టెస్టు సిరిస్‌లలో విజయం సాధించింది. టెస్టుల్లో తిరిగి నంబర్ వన్‌గా అవతరించింది. ప్రపంచంలో ఏ కోచ్ అయినా ఇలాంటి గణంకాలు నమోదు చేస్తే వారినే కొనసాగిస్తారు. కానీ ప్రస్తుతం బీసీసీఐ మాత్రం కొత్త వారిని ఆహ్వానిస్తోంది. టీమిండియా బ్యాటింగ్ కోచ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ ఆర్. శ్రీధర్‌లను చాంపియన ట్రోఫీ వరకూ కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి కాంట్రాక్టులు మార్చిలోనే ముగిశాయి.

కుంబ్లేపై బోర్డు అసంతృప్తి
అయితే, జూన్ 1 నుంచి 18 వరకు ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో బంగర్, శ్రీధర్‌ల వినియోగించుకోవాలని బోర్డు భావించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న కుంబ్లేపై బీసీసీఐ బోర్డు కాస్తంత అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆటగాళ్ల ఫీజులు పెంచండి: కుంబ్లేకి చెక్ పెట్టేందుకేనా?
ఇటీవలే ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌ల కాంట్రాక్టు ఫీజులు పెంచాలని బీసీసీఐ పాలనా కమిటీ(సీఓఏ)కి కెప్టెన్ కోహ్లీతో అనిల్ కుంబ్లేలు నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనిల్ కుంబ్లేకి చెక్ పెట్టేందుకే బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications