Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోచ్‌గా కుంబ్లే నిష్క్రమణ: ట్విటర్లో ఏమన్నాడంటే (ట్వీట్)

హైదరాబాద్: 'నా కోచింగ్‌ శైలిపై కోహ్లీకి అభ్యంతరాలున్నాయి. అందుకే నిష్క్రమిస్తున్నా' టీమిండియా ప్రధాన కోచ్ పదవికి రాజీనామా అనంతరం అనిల్ కుంబ్లే అన్న మాటలివి. గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్టే కెప్టెన్ కోహ్లీతో విభేదాలే కుంబ్లే నిష్క్రమణకు కారణమైంది.

ఇదే విషయాన్ని అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీతో కోచ్‌గా తన ఏడాది పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో కోచ్‌గా తన ప్రస్థానాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. వెస్టిండిస్ పర్యనటకూ కోచ్‌గా కొనసాగాలని బోర్డు కుంబ్లేని కోరినప్పటికీ... కుంబ్లే మాత్రం తక్షణం కోచ్‌గా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.

తనకు పదవిలో కొనసాగే ఉద్దేశం లేదని బోర్డుకు స్పష్టం చేశాడు. కోచ్‌గా తన పద్ధతులపై కెప్టెన్‌కు అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తనకు తెలిపిన నేపథ్యంలో తానీ నిర్ణయం తీసుకుంటున్నట్లు కుంబ్లే మంగళవారం స్పష్టం చేస్తూ తన పదవికి రాజీనామా చేశాడు.

కోచ్‌గా తన నిష్క్రమణపై కుంబ్లే ట్విటర్లో ఏమన్నాడంటే

గౌరవంగా భావిస్తున్నాను

గౌరవంగా భావిస్తున్నాను

'ప్రధాన కోచ్‌గా కొనసాగమని నాపై బీసీసీఐ సలహా కమిటీ విశ్వాసం ఉంచడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఏడాదిగా టీమిండియా సాధించిన విజయాల ఘనత కెప్టెన్‌కు, జట్టంతటికీ, కోచింగ్‌ బృందానికి దక్కుతుంది. వెస్టిండీస్‌ పర్యటనకు కోచ్‌గా కొనసాగమని క్రికెట్‌ సలహా కమిటీ నన్ను కోరింది' అని కుంబ్లే అన్నాడు.

నా కోచింగ్‌ శైలిపై కెప్టెన్‌కు అభ్యంతరాలు

నా కోచింగ్‌ శైలిపై కెప్టెన్‌కు అభ్యంతరాలు

'అయితే నేను ప్రధాన కోచ్‌గా కొనసాగడంపై, నా కోచింగ్‌ శైలిపై కెప్టెన్‌కు అభ్యంతరాలున్నట్లు బీసీసీఐ తొలిసారి సోమవారం తెలిపింది. ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. కోచ్‌గా నా పరిధిని ఎప్పుడూ దాటలేదు. మా ఇద్దరి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు బీసీసీఐ ప్రయత్నించింది' అని అన్నాడు.

ఈ బంధం కొనసాగడం సమర్థనీయం కాదు

ఈ బంధం కొనసాగడం సమర్థనీయం కాదు

'అయితే ఈ బంధం కొనసాగడం సమర్థనీయం కాదన్నది స్పష్టం. అందుకే నేను వైదొలగడం సరైందని నమ్ముతున్నాను. వృత్తితత్వం, క్రమశిక్షణ, అంకితభావం, నిజాయతీ, భిన్న ఆలోచనలు.. ఇలా విశిష్ట లక్షణాలను నేను జట్టులోకి తీసుకొచ్చాను. ఓ బంధం ప్రభావవంతంగా ఉండాలంటే వీటికి విలువ ఇవ్వడం చాలా ముఖ్యం' అని కుంబ్లే తెలిపాడు.

అభ్యంతరాల నేపథ్యంలో వైదొలగాలని నిర్ణయించుకున్నా

'నా కొనసాగింపుపై అభ్యంతరాల నేపథ్యంలో వైదొలగాలని నిర్ణయించుకున్నా. ఏడాదిగా టీమిండియా ప్రధాన కోచ్‌గా సేవలు అందించే అవకాశం దక్కడం నాకు లభించిన గౌరవం. భారత క్రికెట్‌కు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచే అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎప్పటికీ భారత క్రికెట్‌ శ్రేయోభిలాషిగా ఉంటాను' ధన్యవాదాలు అంటూ కుంబ్లే పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+