అనుష్కతో ఎంగేజ్‌మెంట్ వార్తలపై కోహ్లీ ఆగ్రహం: ట్విట్టర్‌లో స్పందన
హైదరాబాద్: బాలీవుడ్ నటి అనుష్క శర్మతో జనవరి 1న నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలపై టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. నిశ్చితార్ధానికి సంబంధించిన ఆలోచన లేదని కోహ్లీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు మీడియాలో వచ్చిన వార్తలన్నీ రూమర్లేనంటూ కోహ్లీ కొట్టిపారేశాడు.
ఒకవేళ తామిద్దరం నిశ్చితార్ధం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లయితే అందులో దాయడానికి ఏమీ లేదని తెలిపాడు. ఆ విషయాన్ని అందిరికీ తెలియజేస్తామని, రహస్యంగా ఎంగేజ్ మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదని కోహ్లి ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. మరోవైపు అనుష్క శర్మ ఈ వార్తలను ఖండించింది.
ట్వీట్ చేసిన రీట్వీట్ చేసిన అనుష్క శర్మ
కోహ్లీ ట్వీట్ చేసిన ట్వీట్లను అనుష్క శర్మ రీట్వీట్ చేసింది. తాము జనవరి 1న నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు రూమర్లేనంటూ పేర్కొంది. వివరాల్లోకి వెళితే న్యూయర్ ఇయర్ రోజున కోహ్లీ-అనుష్క శర్మ ఎంగేజ్‌మెంట్‌కి సిద్ధమవుతున్నట్లు గురువారం జాతీయ మీడియాలో వార్తలు వెలుగుచూశాయి.
న్యూస్ ఛానెల్స్ ప్రసారాలన్నీ రూమర్సే
దేశంలోని ప్రముఖ న్యూస్ ఛానెల్స్ కూడా ఈ న్యూస్‌ని ప్రసారం చేయడం గమనార్హం. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత కోహ్లీ తన ప్రేయసి అనుష్క శర్మతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ఉత్తరాఖండ్ విహారయాత్రలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే.
ఆనందా హోటల్‌లో వీరిద్దరి నిశ్చితార్థం
ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లోని నరేంద్రనగర్ ఆనందా హోటల్‌లో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరగనున్నట్టు కథనాలు వెలువడ్డాయి. కోహ్లీ-అనుష్క ఎంగేజ్‌మెంట్‌కు ప్రముఖులు హాజరవుతారని చెప్పుకున్నారు. అనుష్క స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇప్పటికే అక్కడికి చేరుకొని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని వార్తలు వచ్చాయి. అక్కడి నుంచే వీరిద్దరూ తమ తమ ఇనిస్టాగ్రామ్‌లలో పోస్టు చేస్తున్నారు.
స్పందించిన విరాట్ కోహ్లీ
దీంతో ఈ వార్తలపై చివరికి విరాట్ కోహ్లీ స్పందించాల్సి వచ్చింది. అనుష్కశర్మతో ఎంగేజ్ మెంట్ వార్తలు అవాస్తవం అని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో విహరిస్తుండగా ఒక అభిమానికి వీరిద్దరూ దొరికిపోయారు. ఈ సందర్భంగా ఓ గుడి పూజారి వద్ద ఈ ఇద్దరు ఆశీస్సులు తీసుకుంటుండగా అభిమాని ఒకరు ఫొటో తీసి.. సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
క్రిస్టమస్ ట్విట్టర్ లో కోహ్లీ శుభాకాంక్షలు
ఇక క్రిస్టమస్ శుభాకాంక్షలు చెబుతూ మెడలో రుద్రాక్షమాల వేసుకుని ఓ సెల్ఫీ దిగి అభిమానుల కోసం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications