న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పాండ్యా క్రికెట్ కంటే ర్యాపర్‌గానే బెస్ట్'

Angry Fans Suggest Career Options For Hardik Pandya
Angry Fans Suggest Career Options For Hardik Pandya After Instagram Post

హైదరాబాద్: ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా టెస్టు సిరీస్‌ను పేలవంగా కోల్పోయింది. ఈ ఓటమిలో ఆల్ రౌండర్‌గా పేర్కొంటున్న హార్దిక్ పాండ్యా సరిగా రాణించలేకపోయాడని నెటిజన్లు తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు. వారి వాదనలకు తోడు పాండ్యా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న ఫొటో అభిమానుల ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లు అయింది. క్లీన్ షేవ్‌తో పెద్ద గోల్డ్ చైన్ మెడలో వేసుకుని టీ షర్ట్‌తో ర్యాప్ సింగర్‌లా కనిపిస్తున్నాడు.

ఇంకా ఆ ఫొటో పోస్టు చేసిన హార్దిక్ పాండ్యా దాని కింద 'భారత్‌కు తిరిగి వచ్చేశాం. ఈ పర్యటనలో చాలా పోరాడం. మరికొద్ది రోజుల్లో ఇంటికి చేరుకుంటాం. ఆ తర్వాత మళ్లీ ఆసియా కప్ కోసం బయల్దేరతాం' అని పాండ్యా పేర్కొన్నాడు. ఆ ట్వీట్‌కు సంబంధించి ఓ అభిమాని 'ఇతనిని ఎవరైనా ర్యాప్ సింగర్ చేయండి. ఎందుకంటే ఇతనికి క్రికెట్ మీద మనస్సు లేదనుకుంటా. ఎప్పుడూ ఏదో ఒకటి షో చేయాలనే అనుకుంటాడు.' అని పేర్కొన్నాడు.

అదే ఫొటోపై స్పందించిన మరో నెటిజన్ 'నువ్వు చూడటానికి ఓ గ్యాంగ్‌స్టర్‌లా కనిపిస్తున్నావు.' బార్ లో పని చేసే వాడిలా ఉన్నావు'', 'నీ ప్రవర్తనా శైలీ మరీ ఓవర్ యాక్షన్‌లా అనిపిస్తోంది. ముందు క్రికెట్ బాగా ఆడు. ఈ స్టైల్ అన్ని చోట్లా చూపిస్తావ్ కానీ, క్రికెట్‌లో మాత్రం చూపించవ్' అంటూ తిట్టి పోస్తున్నారు.

ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో ఆడిన హార్దిక్ పాండ్యా వరుసగా 4, 18, 52, 11 స్కోర్లను నమోదు చేశాడు. ఈ క్రమంలో అతని ప్రదర్శనపై విస్తుపోయిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అతనిని ఆఖరిదైన ఐదో టెస్టుకు దూరంగా ఉంచాడు. ఈ లాంగ్ ఫార్మాట్‌లో క్రికెట్ 17వికెట్లు పడగొట్టాడు. సెప్టెంబరు 15 నుంచి జరగనున్న ఆసియా కప్ టోర్నీలో మరోసారి ఈ ఆల్ రౌండర్ టీమిండియాలో కనిపించనున్నాడు.

Story first published: Friday, September 14, 2018, 10:21 [IST]
Other articles published on Sep 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X