ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్న కెప్టెన్ క్లార్క్
సిడ్నీ: యాషెస్ సిరిస్ ఓటమికి భార్యలను, గర్ల్ ప్రెండ్స్‌లను వెంట తీసుకెళ్లడంతో పాటు, జట్టులో సమిష్టితత్వం లోపించడమే కారణమంటూ మాజీలు, క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు తమ భార్యలను విదేశీ టూర్లకు తీసుకెళ్లి, జట్టుతో కాకుండా వేరేగా ఉండటమేంటని ఆస్టేలియా సిడ్నీ డైలీ టెలిగ్రాఫ్ పేర్కొంది.
ఈ వార్తలపై జట్టు కెప్టెన్ మైఖెల్ క్లార్క్ తీవ్రంగా మండిపడ్డాడు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నాడు. ఈ సందర్భంగా మైఖెల్ క్లార్క్ మాట్లాడుతూ తాను చేసిన 28 సెంచరీల్లో 10 టెస్టు సెంచరీలు తన భార్యను వెంట తీసుకెళ్లిచేసినవేనని పేర్కొన్నాడు.
అసలు తాను జట్టుతో లేకుండా రిలేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొనడం తగదన్నాడు. యాషెస్‌లో ప్రతి రోజూ ఆట ముగిసిన తర్వాత ఎలా ఆడాం? ఎలా ఆడాలి? అనే దానిపై జట్టు సభ్యులంతా కలిసి చర్చించుకుంటామని పేర్కొపాడు.

ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో నాల్గవ టెస్టులో ఆస్టేలియా ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో యాషెస్ సిరిస్‌ను 3-1 తేడాతో ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. ఆగస్టు 20 నుంచి 24 వరకు జరగనున్న ఐదో టెస్టు అనంతరం అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించాడు.
నాల్గవ టెస్టు ఓటమి అనంతరం క్లార్క్ మాట్లాడుతూ తాను ఇంకో టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడతానని, అంతటితో తన కెరీర్ ముగుస్తుందని, కుర్రాళ్లను మధ్యలో వదిలేసి వెళ్లలేనని, అందుకే యాషెస్‌లో చివరి టెస్టు కూడా ఆడతానని, రిటైర్మెంట్‌కు ఇది సరైన సమయమని, ఆటను వదిలేయాలని ఎవరూ కోరుకోరని, కానీ గత 12 నెలలుగా తన ప్రదర్శన సంతృప్తినివ్వట్లేదని, జట్టును ముందుండి నడిపించాలని కోరుకున్నానని, కానీ నిరాశపరిచానని, వన్డేల్లో ప్రపంచకప్ ఎలాగో టెస్టుల్లో మాకు యాషెస్ అలాగేనని చెప్పాడు.
తన వంతుగా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ప్రయత్నించానని, తన సహచరులూ అదే చేశారని, కానీ మేం చిత్తుగా ఓడిపోయామని, తర్వాతి తరం ఆటగాళ్లకు అవకాశమివ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. ఆస్ట్రేలియా తరఫున వంద టెస్టులు ఆడగలిగినందుకు అదృష్టవంతుణ్ని అన్నాడు. ఆటకు చాలా రుణపడి ఉంటానని చెప్పాడు.
2004లో భారత్‌పై బెంగుళూరులో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి మైఖెల్ క్లార్క్ అరంగేట్రం చేశాడు. 114 టెస్టుల్లో 49.3 సగటుతో 8628 పరుగులు (28 శతకాలు) చేశాడు. ఇక 2003లో వన్డేల్లో అరంగేట్రం చేసిన క్లార్క్ 245 వన్డేల్లో 44.58 సగటుతో 7981 పరుగులు (8 శతకాలు) చేశాడు. ఆస్ట్రేలియా 46 టెస్టుల్లో నాయకత్వం వహించి 23 మ్యాచ్‌ల్లోవిజయాలందించిన క్లార్క్ 74 వన్డేల్లో 50 విజయాలు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications