For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంక కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ మాథ్యూస్‌కే

By Nageshwara Rao
Angelo Mathews returns as Sri Lanka skipper

హైదరాబాద్: శ్రీలంక పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఏంజెలో మాథ్యూస్‌కే పగ్గాలు అప్పజెప్పారు. మాథ్యూస్‌ను 2019 వన్డే వరల్డ్‌ కప్‌ వరకూ కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) మంగళవారం అధికారిక ప్రకటన చేసింది.

ఆరు నెలల క్రితమే మాథ్యూస్ మూడు ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్నాడు. అయితే అతి తక్కువ సమయంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మరో కెప్టెన్‌ను కష్టం కాబట్టి మళ్లీ వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలను అతడికే అప్పగించారు.

టెస్టుల్లో శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా దినేశ్ చండీమాల్ వ్యవహారిస్తోన్న సంగతి తెలిసిందే. మాథ్యూస్‌కు ముందు వరకు వన్డే కెప్టెన్‌గా ఉన్న ఉపుల్ తరంగ ఇటీవల భారత పర్యటనలో శ్రీలంక 5-0తో వైట్ వాష్‌కు గురవడంతో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

దీంతో త్వరలో బంగ్లాదేశ్, జింబాబ్వేతో జరగనున్న ముక్కోణపు సిరిస్ కోసం మళ్లీ మాథ్యూస్‌కే కెప్టెన్సీ పగ్గాలను అప్పగించారు. అయితే మాథ్యూస్‌ మాట్లాడుతూ 'గతంలో సారథిగా తప్పుకున్నప్పుడే ఇక ఎప్పుడూ ఆ బాధ్యతల్ని మీద వేసుకోవాలని అనుకోలేదు. కాకపోతే ఎస్‌ఎల్‌సీ, ప్రధాన కోచ్‌, శ్రీలంక సెలక్టర్లు నా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని పట్టుబట్టారు' అని అన్నాడు.

'అందుకే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తున్నా. వచ్చే వరల్డ్‌ కప్‌కు సమతూకంతో కూడిన జట్టును తయారు చేయాల్సి ఉంది. వరల్డ్ కప్‌కు 18 నెలలు కంటే తక్కువ సమయం మాత్రమే ఉంది. నేను తిరిగి కెప్టెన్సీ చేపట్టడంలో జట్టు మెంటార్ చందికా హతురసింఘా పాత్ర కీలకం. అతని ప్రేరణతోనే మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడానికి అంగీకరించా' అని అన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 9, 2018, 15:44 [IST]
Other articles published on Jan 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+