For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంచలనం సృష్టించిన ఆండ్రూ టై: ఐపీఎల్‌లో ఒకే రోజు రెండో హ్యాట్రిక్

ఐపీఎల్‌లో ఒకే రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముంబై Vs బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదైంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్‌లో ఒకే రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముంబై Vs బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదైంది. కొన్ని గంటల వ్యవధిలోనే రాత్రి 8 గంటలకు జరిగిన రెండో మ్యాచ్‌లో కూడా హ్యాట్రిక్ నమోదైంది.

రాజ్‌కోట్‌ వేదికగా పూణెతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌ బౌలర్ ఆండ్రూ టై చివరి ఓవర్ తొలి మూడు బంతుల్లో ఈ అద్భుతం సాధించాడు. ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ నమోదు చేసిన పూణెను దెబ్బతీశాడు. రైజింగ్ పుణె సూపర్‌ జెయింట్ బ్యాట్స్‌మెన్ అంకిత్ శర్మ, మనోజ్ తివారీ, ఎస్‌ఎన్ ఠాకూర్‌లను అవుట్ చేశాడు.

అరంగేట్రంలోనే హ్యాట్రిక్ నమోదు చేయడంతోపాటు ఐదు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. చివరి ఓవర్ తొలి బంతికి మనోజ్ తివారిని అవుట్ చేసిన ఆండ్రూ టై.. రెండో బంతికి అంకిత్ శర్మను పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన శార్దుల్ థాకూర్‌ను మూడో బంతికి క్లీన్ బౌల్డ్ చేసిన టై ఈ సీజన్లో రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు.

డెత్ ఓవర్లు వేయడానికి ఇష్టపడే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టై 20వ ఓవర్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు వికెట్లు కోల్పోయిన పూణె ఆ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే సాధించిది. నాలుగు ఓవర్లు వేసిన ఆండ్రూ టై 17 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ఆండ్రా టై దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో పూణె 171 పరుగులు చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన పూణెకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ప్రవీణ్ కుమార్ బౌలింగ్‌లో అజింక్య రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠి (17 బంతుల్లో 33)తో కలిసి కెప్టెన్ స్మిత్ (28 బంతుల్లో 33) దూకుడుగా ఆడటంతో పవర్ ప్లే ముగిసే సమయానికి పుణే రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.

త్రిపాఠి తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన బెన్ స్టోక్స్ 25 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఈ సీజన్లో ఫామ్ లేమితో సతమతం అవుతున్న మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన ధోనీ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మనోజ్ తివారి (27 బంతుల్లో 31), అంకిత్ శర్మ (15 బంతుల్లో 25) జోడి రాణించారు.

Andrew Tye

ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రం బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ శామ్యూల్ బ్రదీ హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో శామ్యూల్స్ బద్రీది 16 హ్యాట్రిక్ కావడం విశేషం. ఐపీఎల్ పదో సీజన్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే ఆండ్రూ టై అద్భుత ప్రదర్శన చేశాడు.

Badri

ఐపీఎల్‌లో ఇప్పటివరకు హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు వీరే:

1. Lakshmipathy Balaji (Chennai Super Kings) Vs Kings XI Punjab in 2008
2. Amit Mishra (Delhi Daredevils) Vs Deccan Chargers in 2008
3. Makhaya Ntini (CSK) Vs Kolkata Knight Riders in 2008
4. Yuvraj Singh (KXIP) Vs Royal Challengers Bangalore in 2009
5. Rohit Sharma (DC) Vs Mumbai Indians in 2009
6. Yuvraj Singh (KXIP) Vs DC 2009
7. Praveen Kumar (RCB) Vs Rajasthan Royals in 2010
8. Amit Mishra (DC) Vs KXIP in 2011
9. Ajit Chandila (RR) Vs Pune Warriors in 2012
10. Sunil Narine (KKR) Vs KXIP in 2013
11. Amit Mishra (Sunrisers Hyderabad) Vs PW in 2013
12. Pravin Tambe (RR) Vs KKR in 2014
13. Shane Watson (RR) Vs SRH in 2014
14. Axar Patel (KXIP) Vs Gujarat Lions in 2016
15. Samuel Badree (RCB) Vs MI in 2017
16. Andrew Tye (GL) Vs RPS in 2017

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+