ఆండ్రూ సైమండ్స్ అకాల మరణం.. విలన్‌గా మారిన హర్భజన్ సింగ్! మంకీ గేట్ వివాదంలో భజ్జీదే తప్పంటూ..

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్, దివంగత క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్‌పై సోషల్ మీడియా వేదికగా సానుభూతి వ్యక్తమవుతోంది. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కారణంగానే ఆండ్రూ సైమండ్స్ కెరీర్ నాశనమైందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా భారత్‌లోని ఓ వర్గం అభిమానులు సైమండ్స్ అకాల మరణం నేపథ్యంలో అతను దగా పడ్డ క్రికెటర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఆండ్రూ సైమండ్స్ గత ఆదివారం(మే15) కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆండ్రూ సైమండ్స్ ఆటను అభిమానించే ఫ్యాన్స్.. అతని అసాధారణమైన ప్రతిభకు ఇంకా ఎన్నో శిఖరాలు ఎక్కిఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

మంకీ గేట్ వివాదంతో..

మంకీ గేట్ వివాదంతో..

కానీ 2008లో అతని జీవితంలో చోటు చేసుకున్న రెండు ఘటనలు సైమండ్స్ కెరీర్‌ను‌ నాశనం చేసాయంటున్నారు. ఆ నెల మొదటి వారంలో భారత్‌తో జరిగిన సిడ్నీ టెస్ట్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో సైమండ్స్ సెంచరీ కొట్టాడు. అదే మ్యాచ్ లో హర్భజన్ సింగ్ తో గొడవ పడ్డాడు కూడా. భజ్జీ తనను మంకీ అన్నాడని సైమండ్స్ ఫిర్యాదు. అలా అనలేదని భజ్జీ అన్నాడు. భజ్జీ హిందీలో మాకీ అని తిట్టాడనే వాదన ప్రచారంలో ఉంది. సైమండ్స్ హిందీ రాక మాకీని మంకీగా అపార్థం చేసుకున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది.

సొంత జట్టు అండగా లేకపోవడంతో..

సొంత జట్టు అండగా లేకపోవడంతో..

ఇక ఎంక్వైరీ కమిషన్ విచారణ పూర్తి కాక ముందే, టూర్ రద్దు చేసుకుని వెళ్ళిపోతామని టీమిండియా బెదిరించింది. అలా టూర్ రద్దయితే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకి ఆర్థికంగా బోలెడంత నష్టం వస్తుంది. అందుకే వాళ్ళు వెనక్కి తగ్గారు. తమ క్రికెట్ బోర్డ్ నుంచే తనకు సపోర్ట్ రాకపోయే సరికి సైమండ్స్ గుండె రగిలిపోయింది. పైగా సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ ఆటగాడు హర్భజన్ సింగ్‌కు అండగా నిలవడంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. తమ పలుకుబడితో ఐసీసీ కూడా తమ మాట వినేలా చేసుకుంది.

ఐపీఎల్‌లో భారీ ధర పలకడం..

ఐపీఎల్‌లో భారీ ధర పలకడం..

ఇక అదే జనవరి నెల చివరిలో ఐపీఎల్ తొలి సీజన్ మెగా వేలం జరిగింది. ధోనీ తర్వాత సైమండ్స్‌కే రూ.5.4 కోట్లు అధిక ధర లభించింది. డెక్కన్ చార్జెర్స్ హైదరాబాద్ ఈ భారీ మొత్తానికి అతన్ని కొనుగోలు చేసింది. దాంతో అతని ఆస్ట్రేలియా టీమ్ మేట్స్‌కు కన్ను కుట్టింది. అందరికన్నా కెప్టెన్ క్లార్క్ ఎక్కువ అసూయ పడ్డాడు. దాంతో అతన్ని దూరంగా ఉంచుతూ హింసించాడు. సైమండ్స్‌కు ముందు నుంచే మద్యం సేవించే అలవాటుంది.

ఈ రెండు సంఘటనల తర్వాత అతని తాగుడు మరీ ఎక్కువయింది. ఓ ఏడాది లోపే అతని ఆస్ట్రేలియా కెరీర్‌కు తెర పడింది. ఆ తర్వాత ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు.

హర్భజన్ సింగ్‌దే తప్పు..

హర్భజన్ సింగ్‌దే తప్పు..

అయితే మంకీ గేట్ వివాదంలో ముమ్మాటికి హర్భజన్ సింగ్‌దే తప్పని సైమండ్స్ ఆరాధించే అభిమానులు వాదిస్తున్నారు. అతను ఎంతో మంచి వాడని కామెంట్ చేస్తున్నారు. హర్భజన్ మంకీ అని జాతి వివక్ష వ్యాఖ్యలు చేయకపోవచ్చు కానీ.. మాకీ అనే మాట దాని కన్న పెద్ద తప్పుడు వ్యాఖ్యని అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ తెలుగు కామెంటేటర్ సీ వెంకటేశ్ సైతం ఇదే వాదనను వినిపించాడు. తన ఫేస్‌బుక్ వాల్‌పై మంకీ గేట్ వివాదంలో సైమండ్స్ తప్పులేదని రాసుకొచ్చాడు. అతని పోస్ట్‌తో చాలా మంది అభిమానులు ఏకీభవిస్తున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, May 18, 2022, 14:59 [IST]
Other articles published on May 18, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X