For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ నెగ్గడంలో కీలకపాత్ర; ఆండ్రూ స్ట్రాస్‌కు కొత్త బాధ్యతలు

 Andrew Strauss appointed ECBs Cricket Committee Chairman

హైదరాబాద్: ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ నియమింపబడ్డాడు. అన్ని స్థాయిల్లోనూ ఇంగ్లండ్‌ క్రికెట్‌ను పర్యవేక్షించే కమిటీ చైర్మన్‌ బాధ్యతను స్ట్రాస్‌కు ఇచ్చినట్లు ఈసీబీ ప్రకటించింది. ప్రస్తుతం ఈసీబీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ ఆష్లే గైల్స్ కొనసాగుతున్నాడు.

అతడి స్థానంలో ఆండ్రూ స్ట్రాస్ కొత్త బాధ్యతలు అందుకోనున్నాడు. ఆండ్రూ స్ట్రాస్ మాట్లాడుతూ "నాకు కష్టకాలంలో ఈసీబీ అండగా నిలిచింది. మళ్లీ నాకు ఒక పాత్రను అప్పచెప్పడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. ముందుగా ఈ సమ్మర్‌ క్రికెట్‌ని ఎంతమంది అభిమానులు ప్రేమించారనే విషయాన్ని తెలుసుకోవాలి. దీనిని మరింత విజయవంతం చేసేందుకు నా వంతు ప్రయత్నిస్తా" అని తెలిపాడు.

42 ఏళ్ల ఆండ్రూ స్ట్రాస్ మంగళవారం ప్రతిష్టాత్మక నైట్‌హుడ్ పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే. గతేడాది ఈసీబీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన ఆండ్రూ స్ట్రాస్ తన భార్య రూత్ పేరిట ఏర్పాటు చేసిన 'రూత్ స్ట్రాస్ ఫౌండేషన్'కు సంబంధించిన కార్యక్రమాలను చూసుకుంటున్నాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఈ ఫౌండేషన్ కోసం విరాళాలు సేకరించారు.

ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకోవడంలో ఆండ్రూ స్ట్రాస్ పాత్ర ఎంతో కీలకం. ఆండ్రూ స్ట్రాస్ ఇంగ్లాండ్ తరుపున 2004-12 మధ్య కాలంలో 100 టెస్టులు ఆడి 40.91 యావరేజితో 7000కు పైగా పరుగులు సాధించాడు. అతడి నాయకత్వంలో ఇంగ్లాండ్ జట్టు రెండు యాషెస్ సిరిస్‌లను గెలిచింది.

Story first published: Friday, September 13, 2019, 13:24 [IST]
Other articles published on Sep 13, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+