ముంబై: వరల్డ్ టీ20లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను వెస్టిండిస్ చిత్తు చేసిన ఫైనల్‌కు చేరడంపై ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాప్.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను రెచ్చగొట్టారు.
ఆస్ట్రేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ధోని సేన 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నప్పుడు యావత్ భారతావని ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలో అమితాబ్, ఆండ్రూ ఫ్లింటాప్ మధ్య ట్విట్టర్‌లో మాటలు వెడెక్కిన సంగతి తెలిసిందే.
తాజాగా ముంబైలో జరిగిన రెండో సెమీపైనల్ మ్యాచ్‌లో టీమిండియా.. వెస్టిండిస్ చేతిలో ఓటమి పాలవ్వడంతో అమితాబ్‌ను రెచ్చగొట్టేలా ఆండ్రూ ఫ్లింటాప్ ట్విట్టర్‌లో ట్వీట్స్ చేశారు. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌కి వెళతామా అంటూ అమితాబ్‌ని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

అంతేకాదు ఈ మ్యాచ్‌కి రెండు టిక్కెట్లు తీసుకురాగలరా? అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఆ తర్వాత అవును అంటూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారిక ట్విట్టర్ హ్యాండ్లర్‌కు ట్వీట్ చేశారు. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం పైనల్ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. వెస్టిండిస్ జట్టు 2012లో వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోగా, ఇంగ్లాండ్ జట్టు కూడా 2010లో వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇరు జట్లలో ఏ జట్టు గెలిచినా ఆ జట్టు టీ20ల్లో రెండో వరల్డ్ కప్‌ను సాధించిన జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది.
అంతక ముందు అస్ట్రేలియా-భారత్ మ్యాచ్ తర్వాత ఆండ్రూ ప్లింటాప్, అమితాబ్ బచ్చన్‌ల మధ్య ట్విట్టర్‌లో జరిగిన సంభాషణ ఇలా ఉంది.