Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిక్సర్లతో విరుచుకుపడిన రసెల్‌.. లంకపై ఘన విజయం.. వెస్టిండీస్‌దే టీ20 సిరీస్‌!!

Andre Russell, Shimron Hetmyer show lifts WI to a 2-0 clean-sweep

పల్లెకెలె (శ్రీలంక): శ్రీలంకతో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను వెస్టిండీస్‌ క్లీన్‌స్వీప్ చేసింది. పల్లెకెలె వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. విండీస్ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌ (14 బంతుల్లో 6 సిక్సర్లతో 40 నాటౌట్‌) సిక్సర్లతో విరుచుకుపడడంతో వెస్టిండీస్‌ మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. వన్డేల్లో 0-3తో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల 155 పరుగులు చేసింది. లంక ఓపెనర్లు కుషాల్ పెరీరా (15), ఆవిష్క ఫెర్నాండో (9) శుభారంభం ఇవ్వలేదు. షెహన్ జయసూర్య (16), కుసల్ మెండిస్ (11)లు కూడా విఫలమయ్యారు. అయితే ఏంజెలో మాథ్యూస్ (23), దాసున్ షనక (24 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్‌) పర్వాలేదనిపించారు. చివరలో తిసారా పెరెరా (21) మెరుపులతో లంక మోస్తరు స్కోర్ చేసింది. ఫాబియో ఆలెన్‌ (2/24) రెండు వికెట్లు తీశాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 17 ఓవరల్లో మూడు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ లెండిల్ సిమన్స్ (9) విఫలమయినా.. మరో ఓపెనర్ బ్రాండన్‌ కింగ్‌ (21 బంతుల్లో 43; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిశాడు. షిమ్రాన్ హెట్‌మైర్‌ (42 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు), ఆండ్రీ రసెల్‌ (14 బంతుల్లో 40 నాటౌట్‌; 6 సిక్స్‌లు) రాణించారు. ముఖ్యంగా రస్సెల్‌ సిక్సర్లతో విరుచుకుపడడంతో విండీస్ సునాయాస విజయాన్ని అందుకుంది. మాథ్యూస్, షనక, కుమార తలో వికెట్ తీశారు.

సిక్సర్లతో విరుచుకుపడిన రసెల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. రసెల్‌ మాట్లాడుతూ... 'ఆరు సిక్సర్లతో 40 పరుగులు చేసిన మొదటి ఆటగాడిని నేనే అని తెలుసుకున్నా. నేను పరుగులు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది జట్టు ప్రదర్శన. అందరూ బాగా ఆడారు. నేను సంతోషంగా ఉన్నాను. మేము సరైన సమయంలో రాణించడం బాగుంది. మాకు మంచి వన్డే జట్టు ఉంది. కానీ..సిరీస్ కోల్పోవడం నిరాశపరిచింది' అని అన్నాడు.

Story first published: Saturday, March 7, 2020, 11:18 [IST]
Other articles published on Mar 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+