Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలాంటి విచిత్ర‌మైన ప్రాంచైజీని ఎప్పుడూ చూడలేదు: స్టార్ ఆల్‌రౌండర్‌

Andre Russell says Jamaica Tallawahs weirdest team Ive ever played

జమైకా: క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (సీపీఎల్‌) ఫ్రాంచైజీ జ‌మైకా త‌ల్ల‌వాస్ లాంటి విచిత్ర‌మైన జ‌ట్టును ఎప్పుడూ చూడలేదు అని విండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్ అన్నాడు. వెస్టిండీస్ జాతీయ జ‌ట్టుతో పాటు ప్రపంచంలోని దాదాపు అన్ని లీగ్‌ల్లో ప‌లు జట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించిన రసెల్.. జ‌మైకా త‌ల్ల‌వాస్ వ్య‌వ‌హ‌ర తీరుపై మాత్రం అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా ఇదే ఫ్రాంచైజీపై విండీస్ సీనియర్ ఓపెనర్ క్రిస్ గేల్ తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

తాజాగా ఆండ్రీ రసెల్‌ మాట్లాడుతూ... 'నేను ప్రాతినిథ్యం వహించిన అన్ని జట్లలోకెల్లా జమైకా తలవాస్‌ విచిత్ర‌మైన‌ది. ఇది ఒక చెత్త ఫ్రాంచైజీ. ఇలాంటి ఫ్రాంచైజీని గతంలో నేనెప్పుడు చూడలేదు. అయితే ఇవి నేను ఊరికే చేస్తున్న ఆరోప‌ణ మాత్రం కాదు. ఆ జ‌ట్టుతో క‌లిసి చాలాకాలంగా కొనసాగుతున్నా. అంతే కాదు ఒక‌ప్పుడు లీడ‌ర్ టీమ్‌లో మెంబ‌ర్‌గానూ ఉన్నా. వారి ఆలోచ‌నా ధోర‌ణిని ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించా. ఆ జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌టం కంటే.. ఊరుకోవ‌డం ఉత్త‌మం. ఇప్పటికైనా యాజ‌మాన్య తీరు మార‌క‌పోతే ఆ జ‌ట్టు మ‌నుగ‌డ క‌ష్ట‌మే' ర‌సెల్ పేర్కొన్నాడు.

మాజీ క్రికెటర్ రామ్‌నరేశ్ శర్వాన్ ‌పై క్రిస్ గేల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. రామ్‌నరేశ్ పాములాంటోడని, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కన్నా డేంజర్ అని విరుచుకుపడ్డాడు. 'తల్లావాస్ జట్టులో ఏం మార్పు. శర్వాన్.. ఈ కుట్రలో నీదే పెద్ద పాత్ర. నా జన్మదిన వేడుకల్లో మన స్నేహం గురించి పెద్ద స్పీచ్‌లు ఇచ్చావు. కానీ నువ్వో పాములాంటోడివి. నమ్మించి వెన్నుపోటు పొడిచావ్. ఈ కరేబీయన్ గడ్డ మీద నిన్ను ఎవరు ఇష్టపడరని నీకు తెలుసు. నీకు ఇప్పటికీ పరిపక్వత రాలేదు. ఈ కుట్రకు ఎప్పుడు ప్రణాళిక రచించావ్?' అని గేల్ మండిపడ్డాడు.

తన యూట్యూబ్ చానెల్ వేదికగా మూడు విభాగాలు విడుదల చేసిన వీడియోలో ఈ యూనివర్సల్ బాస్ తన సహచర ఆటగాడిపై ధ్వజమెత్తాడు. ఇక 2020 సీజన్ సీపీఎల్‌ కోసం తల్లవాస్ టీమ్ గేల్‌ను రిటైన్ చేసుకోలేదు. దీంతో ఈ విండీస్ వీరుడు.. డారెన్ సామీ నేతృత్వంలోని సెయింట్ లూసియా జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సీపీఎల్ తొలి నాలుగు సీజన్లలో గేల్ తల్లావాస్‌కే ప్రాతినిధ్యం వహించాడు.

ఇక షెడ్యూల్ ప్రకారం సీపీఎల్ 2020 సీజన్ ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 26 మధ్య జరగనుంది. కానీ కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఈ షెడ్యూల్‌లో మార్పులు సంభవించవచ్చు. ఒకవేళ ఈ టోర్నీ జరిగినా.. ఓవర్సీస్ ప్లేయర్లు లేకుండా ఖాళీ మైదానాల్లో జరిగే అవకాశం ఉంది. లేకుంటే డిసెంబర్‌కు వాయిదా పడవచ్చు. లీగ్ నిర్వాహకులు ఎప్పటికప్పుడూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Story first published: Friday, May 1, 2020, 9:58 [IST]
Other articles published on May 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+