ఆండ్రూ రస్సెల్ స్థానంలో యంగ్ రెబెల్ స్టార్: వందకు పైగా స్ట్రైక్ రేట్!

లండన్: వెస్టిండీస్ క్రికెట్ జట్టులో యువరక్తం ప్రవేశించింది. గాయపడ్డ ఆండ్రూ రస్సెల్ స్థానంలో యంగ్ రెబెల్ స్టార్‌కు అవకాశం ఇచ్చింది విండీస్ క్రికెట్ బోర్డు. అతని పేరు సునీల్ యాంబ్రీస్. వన్డేల్లో వందకు పైగా స్ట్రైక్ రేట్ ఉన్న ఆటగాడు. స్పెషలిస్ట్ ఓపెనర్. బౌలింగ్ కూడా చేయగలగడం అతని సత్తా. టెస్టులో, వన్డే మ్యాచుల్లో రెండేళ్ల కిందటే అడుగు పెట్టాడు. 26 ఏళ్ల ఈ యంగ్ క్రికెటర్ కరేబియన్ దీవుల్లో విండ్‌వర్డ్‌లోని సెయింట్ విన్సెంట్‌లో జన్మించాడు.
2017 సెప్టెంబర్‌లో ఇంగ్లండ్ జట్టుపై జరిగిన వన్డే టోర్నమెంట్ సందర్భంగా సునీల్ యాంబ్రీస్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభానికి ముందు ఐర్లాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడాడు. తన కేరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఐర్లాండ్‌పై 148 పరుగులు సాధించాడు. సునీల్ యాంబ్రీస్ స్ట్రైక్ రేట్ 105.33. ఆడిన ఆరు వన్డేల్లో రెండు సార్లు నాటౌట్‌గా నిలిచాడు. 316 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ అర్ధ సెంచరీ ఉంది. సిక్సర్లు పెద్దగా కొట్టే సామర్థ్యం లేదు గానీ.. బౌండరీలను మాత్రం అలవోకగా బాదేయగలడు. ఆరు వన్డేల్లో ఒక సిక్సర్ మాత్రమే కొట్టిన సునీల్ యాంబ్రీస్.. ఇప్పటిదాకా 38 బౌండరీలను సాధించాడంటే ఎంత కళాత్మకంగా ఆడగలడో అర్థం చేసుకోవచ్చు.
ఆరు టెస్ట్ మ్యాచ్‌లను కూడా ఆడాడు. టెస్ట్ కేరీర్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తరువాత అదే టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్‌లో సిక్సర్‌తో బోణీ చేశాడు. అతని కేరీర్‌లో ఇప్పటిదాకా నమోదైన ఏకైక సిక్సర్. తొలిసారిగా ప్రపంచకప్ టోర్నమెంట్ ఆడబోతున్నారు. గురువారం మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో భారత్‌తో జరిగే మ్యాచ్ సందర్భంగా వెస్టిండీస్ తుది జట్టులో సునీల్ యాంబ్రీస్‌కు చోటు దక్కుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications