Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR దిగ్గజం సంచలన నిర్ణయం.. ఐపీఎల్‌కు గుడ్‌బై!

Andre Russell: కోల్‌కతా నైట్ రైడర్స్ దిగ్గజం, రెండు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ఆండ్రీ రస్సెల్ ఈ లీగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కేకేఆర్ అతడిని రిలీజ్ చేసిన తర్వాత ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఐపీఎల్ 2026లో ఆండ్రీ రస్సెల్ కోల్‌కతా నైట్ రైడర్స్ సపోర్ట్ స్టాఫ్‌లో పవర కోచ్‌గా చేరనున్నాడు. ఆండ్రీ రస్సెల్ దశాబ్దానికి పైగా కేకేఆర్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. 2014, 2024లో ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైటర్ రైడర్స్ జట్టులో ఆండ్రీ రస్సెల్ కీలక సభ్యుడు. ఆండ్రీ రస్సెల్ అకస్మాత్తుగా ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఓ భావోద్వేగ పోస్ట్ ద్వారా అభిమానులకు వివరించాడు.

ఐపీఎల్ నుంచి రిటైర్ కావడానికి గల కారణాన్ని ఆండ్రీ రస్సెల్ ఓ ఎమోషనల్ వీడియోలో తెలియజేశాడు. "నేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు, ఇది సరైన సమయం అని భావించాను. నేను నా వెనుక ఒక గొప్ప లెగసీని వదిలి వెళ్లాలనుకుంటున్నాను. అభిమానులు 'ఎందుకు? నీలో ఇంకా చాలా ఉంది. నువ్వు ఇంకా కొంచెం ఆడొచ్చు కదా?' అని అడిగేటప్పుడే రిటైర్ అవ్వడం ఉత్తమం. అలా కాకుండా 'అవును, నువ్వు ఇది ఎప్పుడో చేసి ఉండాల్సింది' అని చెప్పే పరిస్థితి రాకూడదు." అని రస్సెల్ పేర్కొన్నాడు.

Andre Russell Retires from IPL KKR Legend to Return in 2026 as Power Coach

రస్సెల్ తన మనసులోని మాటను ఇలా కొనసాగించాడు. "మీరు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మీరు ఇతర జెర్సీలలో (వేరే జట్లలో) మీ ఫోటోలను ఫోటోషాప్ చేయడాన్ని చూస్తుంటారు. పర్పుల్, గోల్డ్ రంగులు (KKR రంగులు) కాకుండా వేరే రంగులలో నన్ను నేను చూసుకోవడం నాకు వింతగా అనిపించింది. ఈ ఆలోచనలు నా మనసులో తిరుగుతూ, కొన్ని రాత్రులు నాకు నిద్ర పట్టకుండా చేశాయి." అని రస్సెల్ అన్నాడు.

ఐపీఎల్ 2026లో కొత్త పాత్ర
ఆండ్రీ రస్సెల్ రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటికీ అతను KKRతో తన అనుబంధాన్ని కొనసాగిస్తాడు. ఆండ్రీ రస్సెల్ రిటైర్‌మెంట్‌తో పాటు వచ్చే సీజన్‌లో కేకేఆర్ పవర్ కోచ్ పాత్రలో ఉంటానని అభిమానులకు శుభవార్త అందించాడు. "వెంకీ మైసూర్, షారుఖ్ ఖాన్‌తో నా ఐపీఎల్ ప్రయాణంలో మరో అధ్యాయం గురించి చాలా చర్చలు జరిగాయి. వారు నాకు ప్రేమ, గౌరవం ఇచ్చారు. నేను మైదానంలో చేసిన ప్రతీ పనిని మెచ్చుకున్నారు. నాకు బాగా తెలిసిన సెటప్‌లో ఉండటం నాకు చాలా ముఖ్యం. కాబట్టి కోల్‌కతా నేను తిరిగి వస్తాను. 2026లో కేకేఆర్ సపోర్ట్ స్టాఫ్‌లో కొత్త పవర్ కోచ్‌గా నేను భాగమవుతానని చెప్పడానికి వచ్చాను." అని ఆండ్రీ రస్సెల్ అన్నాడు. 2015, 2019లలో అతన్ని KKR తరపున ఆడుతూ ఐపీఎల్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. కేకేఆర్ తరపున 133 మ్యాచ్‌లలో 2593 పరుగులు, 122 వికెట్లు తీశాడు.

Story first published: Sunday, November 30, 2025, 15:37 [IST]
Other articles published on Nov 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+