For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అలా చేయడం నాకిష్టం లేదు: రస్సెల్ గాయంపై బ్రాత్‌వైట్

IND V WI 2019,1st T20I:Andre Russell Really Wanted To Play T20Is vs India,Says Carlos Brathwaite
Andre Russell really wanted to play T20Is vs India, says Carlos Brathwaite

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా శనివారం ప్లోరిడా వేదికగా టీమిండియాతో జరగనున్న తొలి టీ20లో ఆండ్రీ రస్సెల్‌కు ఆడాలని ఉందని తనతో చెప్పినట్లు వెస్టిండిస్ కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ అన్నాడు. మైదానంలోకి దిగి తన నైపుణ్యాలను ప్రదర్శించాలని... వెస్టిండీస్ ఫ్రాంచైజ్ కోసం క్రికెట్‌లో తానేమీ చేయగలడో చూపించాలని అనుకున్నాడని బ్రాత్ వైట్ పేర్కొన్నాడు.

కాగా, గాయం కారణంగా అమెరికాలోని ప్లోరిడాలో జరిగే మొదటి రెండు టీ20లకు ఆల్‌రౌండర్‌ రసెల్‌ దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో రసెల్‌ గాయపడిన సంగతి తెలిసిందే. అయినా టీమిండియాతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల కోసం ప్రకటించిన జట్టులో విండిస్ సెలక్టర్లు రస్సెల్‌కు చోటు కల్పించారు.

ప్రస్తుతం కెనడా వేదికగా జరుగుతున్న గ్లోబల్ టీ20 లీగ్‌లో ఆడుతోన్న ఆండ్రీ రస్సెల్‌ గాయం తిరిగి ఇబ్బంది పెట్టడంతో తనంతట తానుగా ఈ పర్యటన నుంచి తప్పుకున్నట్లు సెలక్షన్ ప్యానెల్‌కు తెలియజేశాడు. దీంతో అతడి స్థానంలో జేసన్‌ మహ్మద్‌ను ఎంపిక చేసినట్లు కోచ్‌ ఫ్లాయిడ్‌ తెలిపాడు.

తొలి టీ20కి ముందు విండిస్ కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ మీడియాతో ఆండ్రీ రస్సెల్ మనసులోని మాటను బయపెట్టాడు. అంతేకాదు ఆండ్రీ రస్సెల్ లేకపోవడంతో జట్టు అతిపెద్ద లోటుగా అభివర్ణించాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 సిరిస్‌కు సైతం రస్సెల్ ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

"డ్రెస్సింగ్ రూమ్‌లో, జట్టులో రస్సెల్ చాలా ఉల్లాసంగా ఉంటాడు. నా దృష్టిలో, డ్రెస్సింగ్ రూమ్‌లో అతడొక గొప్ప నాయకుడు. మేము అతన్ని టీ20 ప్రపంచకప్‌కు సిద్ధం చేయవలసి వస్తే, అతడు లేకుండా మేము రెండు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ సిరీస్‌లో అతడిని బలవంతంగా ఆడించి దీర్ఘకాలిక గాయం చేయడం నాకిష్టం లేదు" అని బ్రాత్‌వైట్ అన్నాడు.

Story first published: Saturday, August 3, 2019, 14:34 [IST]
Other articles published on Aug 3, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+