For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WI vs AUS 1st T20: ఆండ్రీ రసెల్ విధ్వంసం.. టీ20లో తొలి హాఫ్ సెంచరీ! ఆస్ట్రేలియాకి భారీ షాక్!!

Andre Russell, Obed McCoy star as West Indies beat Australia in 1st T20I

సెయింట్ లూసియా: టీ20ల్లో తాము ఎంత ప్రమాదకరమో మరోసారి చూపించారు వెస్టిండీస్ ప్లేయర్స్. సీనియర్లు, ఆల్‌రౌండర్‌లతో నిండిన విండీస్.. సొంతగడ్డపై పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించింది. మొదట ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్ తన విధ్వంసంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తొలి హాఫ్ సెంచరీ బాధగా.. ఆపై బౌలర్ ఒబెడ్ మెకాయ్ ఆసీస్ బ్యాట్స్‌మన్‌ పనిపెట్టాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం సెయింట్ లూసియా వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అలవోకగా గెలిచేలా కనిపించిన ఆస్ట్రేలియా.. చివర్లో వరుసగా వికెట్లు చేజార్చుకుని 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.

యూనివర్సల్ బాస్ విఫలం

యూనివర్సల్ బాస్ విఫలం

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్ సిమన్స్ (27: 28 బంతుల్లో 2x4, 2x6) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ ఎవిన్ లావిస్ (0) డకౌట్ అయ్యాడు. యూనివర్సల్ బాస్, సీనియర్ ప్లేయర్ క్రిస్ గేల్ (4: 10 బంతుల్లో 1x4) పూర్తిగా నిరాశపరిచారు. తన శైలికి బిన్నంగా 10 బంతుల్లో కేవలం నాలుగు పరుగులే చేశాడు. ఒకే ఒక ఫోర్ బాది పెవిలియన్ చేరాడు. ఇక మిడిల్ ఓవర్లలో షిమ్రన్ హెట్‌మెయర్ (20: 25 బంతుల్లో 1x4), నికోలస్ పూరన్ (17: 16 బంతుల్లో 3x4) కాసేపు అలరించినా.. భారీ స్కోర్లు చేయలేకపోయారు.

టీ20 కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ

టీ20 కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ

ఆరో స్థానంలో క్రీజులోకి వచ్చిన బిగ్ హిట్టర్ ఆండ్రీ రసెల్ భారీ సిక్సర్లతో చెలరేగిపోయాడు. 28 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఏకంగా ఐదు భారీ సిక్సర్లు బాది.. టీ20 కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ చేశాడు. అంతకుముందు విండీస్ తరఫున 54 మ్యాచులు ఆడినా.. ఒక్కసారి కూడా అర్ద శతకం చేయలేదు. అత్యధిక స్కోర్ 47. రసెల్ హాఫ్ సెంచరీతో వెస్టిండీస్ పోరాడే స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 రన్స్ చేసింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మిచెల్ మార్ష్ రెండు వికెట్లు తీశాడు.

స్టన్నింగ్ క్యాచ్ పట్టిన భారత మహిళా క్రికెటర్!చప్పట్లు కొట్టిన ఇంగ్లండ్ ప్లేయర్ (వీడియో)

 చెలరేగిన మెకాయ్

చెలరేగిన మెకాయ్

146 పరుగుల సాధారణ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ త్వరగానే పెవిలియన్ చేరాడు. 5 బంతుల్లో 4 పరుగులు చేసాడు. అయితే మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ (33: 14 బంతుల్లో 1x4, 3x6)తో కలిసి మిచెల్ మార్ష్ (51: 31 బంతుల్లో 5x4, 2x6) దూకుడుగా ఆడేశాడు. దీంతో ఆసీస్ 4 ఓవర్లలో 46 పరుగులు చేసింది. 46 వద్ద వేడ్ ఔటవగా.. ఆపై వరుస విరామాల్లో ఆసీస్ వికెట్లు కోల్పోయింది. వెస్టిండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు పడగొట్టి.. ఆస్ట్రేలియాని కోలుకోని దెబ్బకొట్టాడు. మెకాయ్ నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు.

127 పరుగులకే ఆలౌట్

127 పరుగులకే ఆలౌట్

ఒబెడ్ మెకాయ్ సహా ఫాబియెన్ అలెన్ రెండు, హెడెన్ వాల్ష్ కూడా చెలరేగడంతో జోష్ ఫిలిప్పీ (1), హెన్రిక్యూస్ (16), బెన్ మెక్‌డీమాట్ (2), డేనియల్ క్రిస్టియాన్ (10), అస్టన్ అగర్ (1), మిచెల్ స్టార్క్ (3), జోష్ హేజిల్‌వుడ్ (0) వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. సునాయాసంగా గెలుస్తుందనుకున్న ఆసీస్ చివరకు 16 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో వెస్టిండీస్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడేందుకు మాక్స్‌వెల్, జె రిచర్డ్‌సన్, డేవిడ్ వార్నర్, మార్కస్ స్టాయినిస్ తదితర క్రికెటర్లు ఈ విండీస్‌ టూర్‌కి దూరంగా ఉన్నారు.

Story first published: Saturday, July 10, 2021, 12:23 [IST]
Other articles published on Jul 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+