PSL 2021: ఆండ్రీ రసెల్‌​ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు!!

దుబాయ్: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ గాయపడ్డాడు. మ్యాచ్ ఆడుతుండగా రసెల్‌ తలకు ప్రమాదవశాత్తూ బంతి తగిలింది. దీంతో కొంత అసౌకర్యానికి గురైన రసెల్‌ను.. స్ట్రెచర్‌పై డ్రెసింగ్ రూంకు తీసుకెళ్లారు. ఆపై అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు. అతడికి పెద్ద ప్రమాదమేమీ జరగనప్పటికీ.. సీటీ స్కాన్​ నిమిత్తమే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ఘటన దుబాయ్ వేదికగా జరుగుతోన్న పాకిస్థాన్​ సూపర్ లీగ్​ (పీఎస్‌ఎల్) 2021లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

రోహిత్‌ ఆట కోసం ఎదురుచూస్తున్నా..పంత్ ఇతర విషయాలను పట్టించుకోవద్దు!తుది జట్టులో ఆ ఇద్దరు స్పిన్నర్లు ఉండాలి!రోహిత్‌ ఆట కోసం ఎదురుచూస్తున్నా..పంత్ ఇతర విషయాలను పట్టించుకోవద్దు!తుది జట్టులో ఆ ఇద్దరు స్పిన్నర్లు ఉండాలి!

పీఎస్‌ఎల్ 2021లో భాగంగా శుక్రవారం క్వెటా గ్లాడియేటర్స్‌, ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. అ‍ప్పటికే రెండు సిక్సర్లతో దూకుడు మీద కనిపించిన ఆండ్రీ రసెల్‌కు ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో మహ్మద్‌ ముసా ఓ షార్ట్‌ బాల్‌ వేశాడు. బంతి బౌన్స్‌ అయి రసెల్‌ హెల్మెట్‌కు బలంగా తాకింది. దాంతో తన హెల్మెట్‌ తీసిన రసెల్‌.. గాయం తీవ్రతను చూసుకున్నాడు. వెంటనే ఫిజియో వచ్చి పరీక్షించి ఏం కాలేదు అన్నట్లుగా చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం అదే తరహాలో వేసిన షార్ట్‌ బాల్‌ను షాట్‌ ఆడే ప్రయత్నంలో మహ్మద్‌ వసీమ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు.

షాట్‌ ఆడిన అనంతరం తల పట్టేయడంతో వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ అలానే కింద కూర్చుండిపోయాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది స్ట్రెచర్‌ తీసుకొచ్చి రసెల్‌ను తీసుకెళ్లారు. అయితే అతడికి పెద్ద ప్రమాదమేమీ లేదని సమాచారం. రసెల్‌ గాయం తీవ్రత గురించి ఎక్స్‌రే తర్వాతే తెలియనుంది. దీనికి సంబంధించిన వీడియోనూ పీఎస్‌ఎల్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి. దీంతో రసెల్‌ ఫాన్స్ కాస్త ఆందోళనలో ఉన్నారు. రసెల్‌ షార్ట్‌ బాల్‌ ఆడడంలో కాస్త వీక్‌ అన్న విషయం తెలిసిందే. గతంలో ఆసీస్ క్రికెటర్​ ఫిలిప్​ హ్యూస్ బంతి తగిలి మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్వెటా గ్లాడియేటర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. వెదర్‌లాండ్‌ 43 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అజమ్‌ ఖాన్‌ 26 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ 10 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది. కొలిన్‌ మున్రో (36 బంతుల్లోనే 90 పరుగులు; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. ఉస్మాన్‌ ఖవాజా 41 పరుగులు చేశాడు. ఈ విజయంతో ఇస్లామాబాద్‌ 6 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా.. వరుసగా నాలుగో పరాజయంతో క్వెటా ఆఖరి స్థానంలో ఉంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, June 12, 2021, 19:35 [IST]
Other articles published on Jun 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X