Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అశ్విన్ చేసిన చిన్న తప్పిదం కారణంగా పంజాబ్ మ్యాచ్‌నే చేజార్చుకుంది

IPL 2019 : Royal Challengers Bangalore vs Mumbai Indians Match Preview ! | Oneindia Telugu
Andre Russell handed lifeline after bizzare mistake by Ravichandran Ashwin in KKR vs KXIP match

హైదరాబాద్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన తప్పిదం మొత్తం మ్యాచ్‌నే చేజారేలా చేసింది. టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్ (48: 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 218 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ ఆండ్రీ రసెల్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

షమీ విసిరిన యార్కర్‌కి రస్సెల్ క్లీన్ బౌల్డ్

షమీ విసిరిన యార్కర్‌కి రస్సెల్ క్లీన్ బౌల్డ్

మహ్మద్ షమీ విసిరిన యార్కర్‌కి రస్సెల్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే అంపైర్ దానిని నోబాల్‌గా ప్రకటించాడు. టీ20ల్లో తొలి ఆరు ఓవర్లు (పవర్ ప్లే) ముగిసిన తర్వాత 20 ఓవర్ల వరకూ 30 యార్డ్ సర్కిల్‌లో కనీసం నలుగురు ఫీల్డర్లు ఉండాలి. కానీ, ఆండ్రీ రస్సెల్ బౌల్డయిన బంతిని షమీ విసిరిన సమయంలో 30 యార్డ్ సర్కిల్‌లో కేవలం ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉండటాన్ని అశ్విన్ గమనించలేదు.

నోబాల్‌గా ప్రకటించిన ఫీల్డ్ అంఫైర్

నోబాల్‌గా ప్రకటించిన ఫీల్డ్ అంఫైర్

దీంతో థర్డ్ అంపైర్‌తో సమీక్షించిన ఫీల్డ్ అంపైర్‌ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత రస్సెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎంతలా అంటే.. మహ్మద్ షమీ వేసిన తర్వాత ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 4 బాదిన రసెల్.. ఆండ్రూ టై బౌలింగ్‌లోనూ 6, 4, 4, 6 సాధించాడు.

17 బంతుల్లో 48 పరుగులు

కేవలం 17 బంతుల్లో 48 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో కోల్‌కతా చివరి 19 బంతుల్లో ఏకంగా 56 పరుగులు రాబట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కోల్‌కతాకు ఇది వరుసగా రెండో విజయం

సొంతగడ్డపై కోల్‌కతాకు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. మరోవైపు రాజస్థాన్‌తో మ్యాచ్‌లో మాన్కడింగ్ రనౌట్‌పై స్పందిస్తూ రూల్స్ మాట్లాడిన అశ్విన్.. తాజా తప్పిదంతో అతనికి క్రికెట్‌ బేసిక్స్‌ కూడా తెలియవంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.

Story first published: Thursday, March 28, 2019, 14:27 [IST]
Other articles published on Mar 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+