
ఏప్రిల్ 29, 1988న కింగ్‌స్టన్‌లో జన్మించిన రస్సెల్
ఆండ్రీ రస్సెల్ జమైకాలోని కింగ్‌స్టన్‌లో ఏప్రిల్ 29, 1988లో జన్మించాడు. సోమవారం అతడు 31వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ప్రస్తుతం రస్సెల్ వెస్టిండిస్ జాతీయ జట్టుతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

టెస్టు క్రికెట్ ద్వారా అరంగేట్రం
ప్రపంచ క్రికెట్‌లోకి టెస్టుల ద్వారా ఆండ్రీ రస్సెల్ అరంగేట్రం చేశాడు. తన తొలి టెస్టు మ్యాచ్‌ని శ్రీలంకపై నవంబర్ 2010లో ఆడాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా ఈ మ్యాచ్‌లో చోటు దక్కించుకున్నాడు.

ఆండ్రీ రస్సెల్ వన్డే
2011 క్రికెట్ వరల్డ్ కప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ వన్డే అరంగేట్రం చేశాడు. మొహాలి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ కేవలం 3 పరుగులే చేసి ఒక వికెట్ తీశాడు.

తొలుత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు
ఐపీఎల్‌లో ఆండ్రీ రస్సెల్‌ను మొదట వేలంలో దక్కించుకున్న జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్). 2012 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ అతడిని వేలంలో సొంతం చేసుకుంది.

2014 ఐపీఎల్ వేలంలో కేకేఆర్ కొనుగోలు
ఐపీఎల్ 2014 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం ఆండ్రీ రస్సెల్‌ను రూ. 60 లక్షలకు సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు రస్సెల్ కేకేఆర్ జట్టు తరుపునే ఆడుతున్నాడు.

40 బంతుల్లో సెంచరీ
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆగస్టు 16న ఆండ్రీ రస్సెల్ 42 బంతుల్లో సెంచరీ సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా నమోదైన సెంచరీ ఇది. ఆ తర్వాత 2018లో ఇదే టోర్నీలో రస్సెల్ 40 బంతుల్లో సెంచరీ సాధించి తన రికార్డుని తానే బద్దలు కొట్టాడు.

ఐపీఎల్ 2017 సీజన్‌కు దూరం
యాంటీ డోపింగ్ ఆరోపణలతో జనవరి 30, 2018న ఆండ్రీ రస్సెల్‌పై ఏడాది పాటు నిషేధం విధించారు. దీంతో ఐపీఎల్ 2017 సీజన్‌కు దూరమయ్యాడు.

50 సిక్సులు బాదిన రస్సెల్
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక స్ట్రయిక్ రేట్ కలిగి ఉన్న ఆటగాడు ఆండ్రీ రస్సెల్. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన రస్సెల్ 207.89 స్ట్రయిక్ రేట్‌ని కలిగి ఉన్నాడు. అంతేకాదు ఇప్పటివరకు మొత్తం 50 సిక్సులు బాదాడు. ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రస్సెల్ 8 సిక్సులు బాదాడు.

గర్ల్‌ప్రెండ్‌ని పెళ్లాడిన రస్సెల్
సుదీర్ఘకాలం డేటింగ్ అనంతరం డొమినికన్‌కు చెందిన తన ప్రేయసి, మోడల్ అయిన జాస్యమ్ లోరాను ఆండ్రీ రస్సెల్ 2016లో వివాహం చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications












