డోపింగ్: విండీస్ క్రికెటర్ అండ్రే రస్సెల్‌పై వేటు
కింగ్‌స్టన్: డోపింగ్ టెస్టు విషయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రే రస్సెల్‌పై వేటు పడింది. అతన్ని ఏడాది పాటు క్రికెట్ ఆడకూడదనే నిషేధం విధించారు. అది జనవరి 31వ తేదీననే అమలులోకి వచ్చింది.
రస్సెల్ కింగ్‌స్టన్‌లో ఇండిపెండెంట్ యాంటీ డోపింగ్ ప్యానెల్ ముందు హాజరు కాలేదు. బ్యాన్ విధించిన విషయాన్ని రసెల్ తరఫు న్యాయవాది పాట్రిక్ ఫోస్టర్ ధ్రువీకరించారు. నిషేధాన్ని సవాల్ చేయడంతో పాటు ఇతర ప్రత్యామ్నాయాల గురించి తాను రసెల్‌తో మాట్లాడుతానని ఆయన చెప్పారు.

తాను ఎక్కడున్నాననే విషయాన్ని గతంలో కూడా రసెల్ తెలియజేయలేదు. అలా అతను మూడు సార్లు చేశాడు. 2105లో వరల్డ్ యాంటీ - డోపింగ్ ఏజెన్సీ మార్గదర్శకాల మేరకు జరిగే డ్రగ్ టెస్టుకు అతను డోపింగ్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, 2105 జనవరి 1, జులై 1, జులై 25 తేదీల్లో రసెల్ తాను ఎక్కడున్నాననే విషయాన్ని చెప్పలేదని జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ ఆరోపించింది.
భారత్‌లో జరిగే ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలకు ఎంపికైన వెస్టిండీస్ జట్టులో అతనికి స్థానం కల్పించారు. గత 12 నెలల కాలంలో అతను మూడు సార్లు డోపింగ్ టెస్టుకు హాజరు కాలేదు. 2012లో ట్వంటీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.
అతనిపై విధించిన ఏడాది నిషేధం 2018 జనవరి 30వ తేదీన ముగుస్తుంది. దీంతో 2017లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కూడా ఆడే అవకాశం లేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో అతను ఉన్నాడు. అది తమకు పెద్ద నష్టమని కెకెఆర్ సిఇవో వెంకీ మైసూర్ అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications