పాక్‌ను చిత్తుగా ఓడించిన విండిస్: రసెల్‌పై కెప్టెన్ ప్రశంసల వర్షం

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో వెస్టిండిస్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తగా ఓడించింది. ముఖ్యంగా విండిస్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనడంలో పాకిస్థాన్ ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
దీంతో పాకిస్థాన్ 21.4 ఓవర్లకు 105 పరుగులకు కుప్పకూలింది. పాకిస్థాన్‌కు ఇది వరల్డ్‌కప్‌లో రెండో అత్యల్ప స్కోరు. ఈ క్రమంలో పాక్ ఖాతాలో ఓ చెత్త రికార్డు కూడా నమోదైంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ విజయం సాధించడంలో ఆ జట్టు బౌలర్లు కీలకపాత్ర పోషించారు. దీంతో ఈ విజయాన్ని విండిస్ బౌలర్లకు అంకితం చేస్తున్నట్లు కెప్టెన్ జాసన్ హోల్డర్ తెలిపాడు.

హోల్డర్ మీడియాతో మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ "ప్రపంచ కప్ టోర్నీని విజయంతో ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. కొత్త బంతితో వికెట్లు తీయడం మ్యాచ్‌ని మలుపు తప్పింది. ఇక మా జట్టుకు దొరికిన అరుదైన రకం ఆటగాడు రసెల్. అతడి ప్రభావం జట్టులో చాలా ఉంటుంది" అని అన్నాడు.

రసెల్ 100 శాతం న్యాయం చేశాడు
"అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ రసెల్ 100 శాతం న్యాయం చేశాడు. ఒషానే, షెల్డోన్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. ఒషానే బౌలింగ్‌లో మ్యాచ్ గెలవాలన్న కసి కనిపించింది. మొదటి మ్యాచ్ ఎలా సాగుతుందోనని చాలా కంగారు పడ్డాను. కానీ అత్యంత సులువుగా గెలిచేశాం" అని హోల్డర్ తెలిపాడు.

7 వికెట్ల తేడాతో ఘన విజయం
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై వెస్టిండిస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 106 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ 13.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి అలవోక విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండిస్ జట్టులో క్రిస్ గేల్ 34 బంతుల్లో 50(6 ఫోర్లు, 3 సిక్సులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

105 పరుగులకే ఆలౌటైన పాక్
అంతకముందు టాస్ ఓడి తోలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 21.4 ఓవర్లకు 105 పరుగులకు కుప్పకూలింది. పాకిస్థాన్ ఏ దశలోనే విండీస్ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కోలేకపోయింది. పాకిస్థాన్ జట్టులో ఫకర్ జమాన్ (22), బాబర్ ఆజామ్ (22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. విండిస్ జట్టులో ఒషాన్ థామస్ నాలుగు వికెట్లు, హోల్డర్ మూడు, ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications