న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వీడియో: విండిస్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ తండ్రి కాబోతున్నాడు!

Andre Russell and Jassym Lora announce the arrival of their baby in a grand style

హైదరాబాద్: వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. తన భార్య జాస్సిమ్ లోరా ప్రస్తుతం ప్రగ్నెంట్. త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ 2016లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. తన భార్య ప్రగ్నెన్సీ వేడుకను ఆండ్రీ రస్సెల్ వినూత్నంగా జరిపాడు.

అండ్రీ రస్సెల్ తన చేతిలో బ్యాట్‌ను పట్టుకుని... తన భార్యను బౌలింగ్ చేయమని కోరాడు. అయితే, ఆమె ఎలా బౌలింగ్ చేయాలో తెలియక అయోమయంలో పడింది. అప్పుడు రస్సెల్ ఆమెకు ఎలా బౌలింగ్ చేయాలో చూపించడంతో ఆమె బంతిని విసిరంది. ఆ బంతిని రస్సెల్ బాదగా ఒక్కసారిగా రంగులతో కూడిన మెరుపులు బయటకు వచ్చాయి.

యాషెస్ సిరీస్ నిలుపుకున్న ఆసీస్.. 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!!యాషెస్ సిరీస్ నిలుపుకున్న ఆసీస్.. 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!!

దీంతో ఇద్దరూ ఒకరిని మరొకరు కౌగిలించుకుని ఆనందంతో ఎగరి గంతులేశారు. ఈ వేడుకకు కేవలం రస్సెల్ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని రస్సెల్ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు. ఐపీఎల్ 12వ సీజన్‌లో జాస్సిమ్ లోరా చేసిన సందడి ప్రతి ఒక్క కేకేఆర్ అభిమానికి ఇప్పటికీ గుర్తే.

గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున ఆండ్రీ రస్సెల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినప్పుడు గ్యాలరీ నుంచి జాస్సిమ్ లోరా అతడిని ఎంతో ఉత్సాహాపరచింది. ఏప్రిల్ 29న ఆండ్రీ రస్సెల్ కోల్‌కతా ఆటగాళ్లతో కలిసి తన 31వ పుట్టినరోజుని జరుపుకున్న సందర్భంలో జాస్సిమ్ లోరా కూడా సందడి చేసింది.

ప్రస్తుతం ఆండ్రీ రస్సెల్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో జమైకా తల్లవాస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన జమైకా తల్లవాస్ జట్టు కేవలం ఒక్క గేమ్‌లో మాత్రమే విజయం సాధించింది.

Story first published: Monday, September 16, 2019, 13:26 [IST]
Other articles published on Sep 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X