For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చివరి మ్యాచ్ ఆడేసిన విధ్వంసక బ్యాటర్.. ఎమోషనల్ మూమెంట్!

Andre Russell: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో ఒకరైన ఆండ్రీ రస్సెల్ నేడు తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 15 బంతుల్లో 36 పరుగుల దూకుడు ఇన్నింగ్స్‌తో ఆండ్రీ రస్సెల్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. జమైకాలోని సబీనా పార్క్‌లో జరిగిన తన చివరి మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ గతంలో కంటే మరింత దూకుడుగా ఆత్మవిశ్వాసంతో, నిర్ధాక్షిణ్యంగా కనిపించాడు.

2 ఫోర్లు, 4 సిక్సర్లు
240 స్ట్రైక్ రేట్‌తో 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అంటే 36 పరుగుల్లో 32 పరుగులు బౌండరీల నుంచి వచ్చాయి. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్ కీపర్ ఇంగ్లిస్ చేతికి చిక్కి ఔటయ్యాడు. ఆస్ట్రేలియాతో తన స్వస్థలమైన జమైకాలో జరగనున్న రెండో టీ20 తన చివరి వెస్టిండీస్ మ్యాచ్ అవుతుందని రస్సెల్ ఇప్పటికే ప్రకటించాడు. రస్సెల్ ఔటవ్వగానే ఆస్ట్రేలియా ఆటగాళ్లు అతని అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు తెలిపేందుకు అతని వద్దకు పరిగెత్తారు.

Andr Russell Bids Farewell with Explosive 36 in Final International Match An Emotional Moment

చివరి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్
వెస్టిండీస్ రోస్టన్ చేజ్, షెర్పాన్ రూథర్‌ఫోర్డ్ వరుసగా 2 వికెట్లు కోల్పోయి.. జట్టు 98-5 వద్ద కష్టాల్లో ఉన్నప్పుడు రస్సెల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆండ్రీ రస్సెల్ తన ఇన్నింగ్స్‌ను ధనాధన్‌గా ప్రారంభించి.. తన రెండో బంతికే సిక్స్ కొట్టాడు. బెన్ ద్వార్షుయిస్ బౌలింగ్‌లో మరో రెండు సిక్సర్లు బాది వేగంగా 7 బంతుల్లో 20 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రస్సెల్ తర్వాతి ఓవర్లో ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టాడు. 15 బంతుల్లో 36 పరుగులు చేసి ఔటయ్యే ముందు నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో ఒక ఫోర్ కూడా కొట్టాడు.

రస్సెల్‌కు గార్డ్ ఆఫ్ ఆనర్
అంతకు ముందు ఆండ్రీ రస్సెల్‌కు గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. మైదానం మధ్యలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు చప్పట్లు కొట్టి రస్సెల్‌ను గౌరవించారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆండ్రీ రస్సెల్‌కు ఒక ప్రత్యేక బహుమతిని అందించింది.

172 పరుగులు చేసిన వెస్టిండీస్
టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా వెస్టిండీస్‌ను 172 పరుగులకే కట్టడి చేసింది. వెస్టిండీస్ తరఫున ఓపెనర్ బ్రాండన్ కింగ్ 36 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఆ తర్వాత అత్యధిక పరుగులు ఆండ్రీ రస్సెల్ బ్యాట్ నుంచి వచ్చాయి. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రస్సెల్ 15 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తరఫున అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 3 వికెట్లు తీయగా.. పార్ట్ టైం స్పిన్నర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, నాథన్ ఎల్లిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ లో జోష్ ఇంగ్లిస్(78), కామెరూన్ గ్రీన్(56) అద్భుతంగా రాణించడంతో ఆస్ట్రేలియా జట్టు 15.2 ఓవర్లలోనే 173 పరుగులు చేసి విజయాన్ని సాధించింది.

Story first published: Wednesday, July 23, 2025, 11:10 [IST]
Other articles published on Jul 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+