Andhra Premier League 2023: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. ఆ స్టార్‌కు భారీ ధర!
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏసీఎల్) ముహూర్తం ఖరారైంది. ఈ టోర్నీ ఆగస్టు 16 నుంచి 27వ తేదీ వరకు జరుగుతుంది. మొత్తం ఆరు టీమ్స్ ఆ టోర్నీలో తలపడతాయి. ఈ టోర్నీ మ్యాచులన్నీ కూడా విశాఖపట్టణంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో జరుగుతాయి.
ఈ టీ20 టోర్నమెంట్‌లో ఉత్తరాంధ్ర లయన్స్, బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్.. మొత్తం ఆరు టీమ్స్ తలపడతాయి. ఈ ఆరు జట్లు ఆగస్టు 16 నుంచి 23వ తేదీ వరకు రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో తలపడతాయి. ఆ తర్వాత ఎలిమినేటర్ (ఆగస్టు 25), క్వాలిఫైయర్-1 (ఆగస్టు 25), క్వాలిఫైయర్-2 (ఆగస్టు-26) జరుగుతాయి.

ఆగస్టు 27న టోర్నీ ఫైనల్ ఉంటుంది. ఈ టోర్నీ వేలానికి ముందే ఉత్తరాంధ్ర, బెజవాడ జట్లు తమ కీలక ప్లేయర్లయిన కేఎస్ భరత్, రికీ భుయ్ తదితరులను రిటైన్ చేసుకున్నాయి. టీమిండియా బ్యాటర్ హనుమ విహారి ఈ లీగ్‌లో అత్యధికంగా రూ.6.6 లక్షల ధర పలికాడు. అతన్ని రాయలసీమ కింగ్స్ కొనుగోలు చేసింది.
అతనితోపాటు గోదావరి ప్లేయర్ ఎం ధీరజ్ కుమార్ (రూ.5.2 లక్షలు), ఉత్తరాంధ్ర ప్లేయర్ యర్రా పృథ్వీ రాజ్ (రూ.5 లక్షలు), వైజాగ్ ప్లేయర్ అశ్విన్ హెబ్బార్ (రూ.5 లక్షలు) మాత్రమే రూ.5 లక్షల మార్కు దాటారు. మిగతా వాళ్లకు అంత ధర లభించలేదు.
ఏపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదే..
ఆగస్టు 16, 5 PM, కోస్టల్ రైడర్స్ vs బెజవాడ టైగర్స్
ఆగస్టు 17, 10 AM, వైజాగ్ వారియర్స్ vs గోదావరి టైటాన్స్
ఆగస్టు 17, 3 PM, రాయలసీమ కింగ్స్ vs ఉత్తరాంధ్ర లయన్స్
ఆగస్టు 18, 12 PM, కోస్టల్ రైడర్స్ vs వైజాగ్ వారియర్స్
ఆగస్టు 18, 5 PM, బెజవాడ టైగర్స్ vs గోదావరి టైటాన్స్
ఆగస్టు 19, 10 AM, బెజవాడ టైగర్స్ vs రాయలసీమ కింగ్స్
ఆగస్టు 19, 3 PM, ఉత్తరాంధ్ర లయన్స్ vs కోస్టల్ రైడర్స్
ఆగస్టు 20, 10 AM, ఉత్తరాంధ్ర లయన్స్ vs వైజాగ్ వారియర్స్
ఆగస్టు 20, 3 PM, గోదావరి టైటాన్స్ vs రాయలసీమ కింగ్స్
ఆగస్టు 21, 12 PM, బెజవాడ టైగర్స్ vs ఉత్తరాంధ్ర లయన్స్
ఆగస్టు 21, 5 PM, రాయలసీమ కింగ్స్ vs వైజాగ్ వారియర్స్
ఆగస్టు 22, 12 PM, గోదావరి టైటాన్స్ vs కోస్టల్ రైడర్స్
ఆగస్టు 22, 5 PM, వైజాగ్ వారియర్స్ vs బెజవాడ టైగర్స్
ఆగస్టు 23, 12 PM, కోస్టల్ రైడర్స్ vs రాయలసీమ కింగ్స్
ఆగస్టు 23, 5 PM, ఉత్తరాంధ్ర లయన్స్ vs గోదావరి టైటాన్స్
ఆగస్టు 25, 12 PM, ఎలిమినేటర్
ఆగస్టు 25, 5 PM, క్వాలిఫైయర్ 1
ఆగస్టు 26, 5 PM, క్వాలిఫైయర్ 2
ఆగస్టు 27, 5 PM, ఫైనల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications