Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జాతీయ క్రీడల్లో తెలుగు అథ్లెట్ల జోరు.. ఆంధ్రజట్టుకు పసిడి పతకం

ఉత్తరాఖండ్‌ వేదికగా ప్రతిష్టాత్మక 38వ జాతీయ క్రీడలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. తమ అద్భుత ప్రదర్శనలతో పతకాలను ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ క్రీడల్లో ఆంధ్ర, తెలంగాణ, ఖాతాల్లో మరిన్ని పతకాలు వచ్చి చేరాయి.

ఆంధ్రప్రదేశ్‌ బీచ్‌ వాలీబాల్‌ టీమ్ గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది.ఈ తుది పోరులో ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన కె.మణికంఠరాజు, ఎల్‌.దివ్యసాయి ద్వయం.. 25-23, 21-19 తేడాతో తమిళనాడు జోడీపై విజయాన్ని అందుకుంది. తద్వారా పసిడి పతకాన్ని ముద్దాడింది. ఇక బాక్సింగ్‌ 91 ప్లస్‌ కిలోల విభాగంలో తెలంగాణకు చెందిన బాక్సర్‌ అబ్దుల్‌ జావేద్‌ కాంస్యం పతకాన్ని గెలుచుకున్నాడు.

Andhra Pradesh Beach Volleyball men s team won gold medal in 38th national games 2025
Photo Credit: X

ఆర్చరీలో విజేతలుగా దీపిక, జుయెల్‌
ఈ జాతీయ క్రీడల్లో ఆర్చరీ విభాగంలో సీనియర్ దీపిక కుమారి, 18 ఏళ్ల జుయెల్‌ సర్కార్‌ విజయం సాధించారు. మహిళల రికర్వ్‌ సింగిల్స్‌ ఫైనల్ లో దీపిక 6-4 తేడాతో అంకిత (బిహార్‌)పై పోరాడి గెలిచింది. అయితే పురుషుల రికర్వ్‌ సింగిల్స్‌లో స్టార్‌ ఆర్చర్‌ తరుణ్‌ దీప్‌ రాయ్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. సెమీ ఫైనల్లో తరుణ్ 2-6 తేడాతో 18 ఏళ్ల జుయెల్‌పై పరాజయం పొందాడు. అయినప్పటికీ అతడు బ్రాంజ్ మెడల్ ను సంపాదించుకున్నాడు. కంచు పోరులో ఇంద్ర చంద్‌ను తరుణ్‌ దీప్‌ 6-4 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఇక రికర్వ్‌ టీమ్‌ విభాగంలో ఝార్ఖండ్ జట్టు విజేతగా నిలిచింది. దీపిక, అంకిత భాకత్, కోమలిక, తమన్నాతో కూడిన మహిళల జట్టు 0-6 తేడాతో మహారాష్ట్ర జట్టును ఓడించింది.
Story first published: Friday, February 7, 2025, 10:25 [IST]
Other articles published on Feb 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+