For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వేణుగోపాల రావు

Indian Cricketer Venugopal Rao Announces Retirement From All Forms || Oneindia Telugu
Andhra Cricketer Venugopal Rao retires from all forms of cricket

ముంబై: భారత మాజీ ఆటగాడు, ఆంధ్ర రంజీ కెప్టెన్ వై.వేణుగోపాల రావు (37) క్రికెట్‌ ఆటకు వీడ్కోలు పలికాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు వేణుగోపాల రావు మంగళవారం ప్రకటించాడు. '16 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి.. 65 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన వేణుగోపాల రావు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు' అని ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) తెలిపింది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

16 వన్డేలు.. 218 పరుగులు:

16 వన్డేలు.. 218 పరుగులు:

2005 జులై 30న శ్రీలంకతో తొలి వన్డే ఆడిన వేణు.. 2006 మే 23న వెస్టిండీస్‌తో కెరీర్లో ఆఖరి వన్డే ఆడాడు. కేవలం పది నెలల కాలం మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. టీమిండియా తరపున 16 వన్డేల్లో 218 పరుగులు చేశాడు. అందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. ఏకైక అర్ధ సెంచరీ పాకిస్తాన్‌పై సాధించాడు. అత్యధిక స్కోర్ 61 నాటౌట్.

 65 ఐపీఎల్‌ మ్యాచ్‌లు:

65 ఐపీఎల్‌ మ్యాచ్‌లు:

121 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 7081 పరుగులు సాధించాడు. అందులో 17 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వేణుగోపాల రావు 2008-2014 మధ్య కాలంలో ఐపీఎల్‌లో మొత్తం 65 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌, దిల్లీ డేర్‌డెవిల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున వేణు బరిలోకి దిగాడు. టీ20లలో మాత్రం వేణు ఆకట్టుకోలేకపోయాడు. మొదటి సీజన్లో పర్వాలేదనిపించిన వేణు.. ఆ తర్వాత పరుగులు చేయడంలో ఇబ్బందిపడ్డాడు.

జనసేన పార్టీలోకి:

జనసేన పార్టీలోకి:

దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చిన వేణు.. అంతర్జాతీయ కెరీర్‌ మాత్రం ఆశాజనకంగా సాగలేదు. అయితే విజయ్‌ హజారే ట్రోఫీ, దేవధర్‌ ట్రోఫీ, చాలెంజర్‌ ట్రోఫీలో తనదైన ముద్ర వేసాడు. 2017 అక్టోబరులో ఆంధ్ర, తమిళనాడు మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌ ఆడిన తర్వాత రెండేళ్లుగా వేణుగోపాల రావు మళ్లీ మైదానంలోకి దిగలేదు. ప్రస్తుతం క్రికెట్‌ కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. వేణు 2019 ఎన్నికలకు ముందు హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరాడు.

Story first published: Wednesday, July 31, 2019, 9:13 [IST]
Other articles published on Jul 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+