ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్: వైస్ కెప్టెన్‌గా జేమ్స్ ఆండర్సన్
హైదరాబాద్: నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల యాషెస్ సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్‌గా జేమ్స్ ఆండర్సన్ ఎంపికయ్యాడు. యాషెస్ సిరిస్ నుంచి ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను తప్పించిన నేపథ్యంల అతడి స్ధానంలో ఆండర్సన్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్‌గా జో రూట్ ఉన్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టులో సీనియర్ ఆటగాడైన ఆండర్సన్‌కు అదనంగా మరో బాధ్యతను అప్ప చెప్పినట్లు బోర్డు ఈ సందర్భంగా పేర్కొంది. ఇక ఆండర్సన్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ రికార్డు నెలకొల్పాడు. పేసర్లలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు.
ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ (800) అగ్రస్ధానంలో ఉండగా, ఆ తర్వాతి స్ధానాల్లో షేన్ వార్న్ (708), అనిల్ కుంబ్లే (619), మెక్‌గ్రాత్ (563), వాల్ష్ (519)లు అతనికంటే ముందున్నారు. యాషెస్ సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు నవంబర్ 23న బ్రిస్బేన్ విదేకగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications