న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌కు గ్లామ్ డాల్ దూరం.. ఈ మెగా టోర్నీలో ఆ బ్యూటీ కనిపించదు..ఫ్యాన్స్ పరేషాన్..!

Anchor Mayanti Langer missed out of from IPL 2020, Here is the new list of Anchors from star sports

ఇండియన్ ప్రీమియర్ లీగ్... షార్ట్‌గా ఐపీఎల్. ప్రపంచంలోనే అత్యంత భారీ ఖర్చుతో జరిగే మెగా టోర్నీల్లో ఈ క్రికెట్ టోర్నీ ఒకటి. ఈ నెలన్నర పాటు నాన్‌స్టాప్‌గా జరిగే ఈ టోర్నీ గురించి ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి. సాధారణంగా భారత్‌లో జరిగే ఈ మెగా లీగ్... కరోనా కారణంగా దుబాయ్‌కి తరలిపోయింది. ఐపీఎల్ ఈ సారి ప్రేక్షకులు లేకుండా జరుగుతున్నప్పటికీ... ఎంటర్‌టైన్‌మెంట్‌కు మాత్రం కొదవ లేదని చెబుతున్నారు నిర్వాహకులు.

అంతేకాదు ఐపీఎల్ అంటే గ్లామర్ గేమ్ అని కూడా చాలామంది చెబుతుంటారు. కొంతమంది అభిమానులు కేవలం గ్లామర్ కోసమే అంటే ఇక్కడ యాంకర్ల కోసమే ఐపీఎల్ చూస్తారనే ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌ స్పోర్ట్స్ ఈ మెగా ఈవెంట్‌కు యాంకర్లుగా వ్యవహరించే వారి జాబితాను విడుదల చేసింది.

 మయాంతి లాంగర్ దూరం

మయాంతి లాంగర్ దూరం

సాధారణంగా ఐపీఎల్‌ అంటేనే గ్లామర్ డోస్ ఎక్కువగా ఉంటుంది. ఇటు లేడీ కామెంటేటర్ల నుంచి లేడీ యాంకర్ల వరకు అంతా గ్లామర్‌ డోస్‌తో కనిపించేవాళ్లే. ఇంకాస్త ముందుకు వెళితే చీర్ గర్ల్స్ టోర్నీకి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నారు. ఒకవేళ టోర్నీ భారత్‌లో జరుగుతున్నట్లయితే చీర్ గర్ల్స్‌కు కొన్ని వారు ధరించే దుస్తులపై కొన్ని ఆంక్షలు ఉండేవేమో కానీ ఇప్పుడు దుబాయ్‌ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇక చీర్‌ గర్ల్స్ ఔట్‌ఫిట్ పై ఆంక్షలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. తాజాగా ఐపీఎల్‌‌కు సంబంధించి స్టార్ స్పోర్ట్స్ సంస్థ యాంకర్ల జాబితాను ప్రకటించింది. ఇందులో ఐపీఎల్ టోర్నీకి గ్లామర్ యాడ్ చేసే యాంకర్ మయాంతి లాంగర్‌కు చోటు దక్కలేదు.

స్టార్ స్పోర్ట్స్ కావాలనే తప్పించిందా..?

స్టార్ స్పోర్ట్స్ కావాలనే తప్పించిందా..?

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా యాంకర్‌గా మయాంతి లాంగర్‌కు చోటు దక్కలేదు. స్టార్ స్పోర్ట్స్ ప్రకటించిన జాబితాలో మయాంతి పేరు లేకపోవడంతో ఫ్యాన్స్ ఒక్కింత నిరాశకు గురయ్యారు. అయితే ఈ మెగా టోర్నీకి ఆమెను స్టార్ స్పోర్ట్స్‌ యాజమాన్యమే తప్పించిందా.. లేక ఆమెనే వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారా అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇండియన్ టీవీ స్పోర్ట్స్ జర్నలిస్టుగా ఉన్న మయాంతి లాంగర్ మ్యాచ్‌కు ముందు, మ్యాచ్‌ ముగిసిన తర్వాత గ్లామర్‌తో ఫ్యాన్స్‌ను అలరించేది. తన డ్రెస్సింగ్‌తోనే సగం మంది అభిమానులను టీవీలకు కట్టిపడేస్తుంది. ఎంతలా అంటే ఛానెల్ కూడా మార్చాలంటే ఆ సమయంలో మయాంతి లాంగర్‌ను మిస్ అవుతామేమో అనేలా. ఇక ఐపీఎల్ గ్లామర్ గేమ్ కాబట్టి పొట్టి దుస్తులు ధరించేందుకు కూడా ఏ మాత్రం వెనకాడలేదు మయాంతి.

 ఎన్నో మెగా టోర్నీలకు వ్యాఖ్యాతగా

ఎన్నో మెగా టోర్నీలకు వ్యాఖ్యాతగా

మయాంతి ఒక్క ఐపీఎల్‌కు మాత్రమే వ్యాఖ్యతగా వ్యవహరించలేదు.. ఇతర మెగా టోర్నీలకు కూడా ఆమె యాంకర్‌గా వ్యవహరించారు. జీ స్పోర్ట్స్‌లో టెలికాస్ట్ అయిన ఫుట్‌బాల్ కేఫ్‌తో పాటు అనేక ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు కూడా ఇటు యాంకర్‌గా అటు కామెంటేటర్‌గా వ్యవహరించింది. 2011 వరల్డ్ కప్‌ , 2014 ఇండియన్ సూపర్‌లీగ్,2015 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్,2018 2019లో జరిగిన ఐపీఎల్‌తో పాటు 2019లో జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌కు కూడా ఆమె యాంకర్‌గా వ్యవహరించారు. ఇక ఆమె క్రికెటర్ స్టువర్ట్ బిన్నీని పెళ్లి చేసుకుంది.

ఆస్ట్రేలియన్ హాట్ యాంకర్‌కు చోటు

ఆస్ట్రేలియన్ హాట్ యాంకర్‌కు చోటు

జతిన్ సప్రూ, అనంత్ త్యాగి, సంజనా గణేశన్, సుహాలి చందోక్‌లు ముందు సీజన్లలో కూడా ఉన్నారు. ఈ సారి కూడా వారి పేర్లు స్టార్ స్పోర్ట్స్ ప్రకటించిన జాబితాలో ఉన్నాయి. ఇక కొత్త ముఖాల విషయానికొస్తే... ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టీవీ ప్రెజెంటర్ స్పోర్ట్స్ జర్నలిస్టు నెరోలీ మెడోస్‌తో స్టార్ స్పోర్ట్స్ ఒప్పందం కుదుర్చుకుంది. నెరోలీ కూడా చాలా హాట్ అనే ముద్ర వేసుకుంది. గతంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్‌వార్న్‌తో కలిసి నెరోలీ చక్కర్లు కొట్టినప్పుడు తొలిసారిగా ఆమె పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపించింది. ఇక మిగతావారిలో సురేన్ సుందరం, కిరా నారాయణన్, నష్‌ప్రీత్ కౌర్, తాన్య పురోహిత్, ధీరజ్ జునేజాలు ఉన్నారు. కిరా నారాయణన్ థియేటర్ యాక్ట్రెస్. వైవిధ్య భరితమైన పాత్రలు పోషించడంతో పాటు పలు స్పోర్ట్స్ కార్యక్రమాలకు కూడా యాంకర్‌గా వ్యవహరించింది. తాన్యా పురోహిత్ కూడా మంచి నటి. ఆమె అనుష్క శర్మ లీడ్‌ రోల్‌ చేసిన ఎన్‌హెచ్-10 సినిమాలో నటించింది.

మొత్తానికి ఐపీఎల్ గ్లామర్ అంటేనే టక్కున గుర్తుకు వచ్చే మయాంతి లాంగర్ ఈ సారి టోర్నీకి దూరమవుతుండటంతో ఏదో తెలియని వెలితి అయితే ఉంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. మ్యాచ్‌కు ప్రారంభం ముందు కనిపించి కుర్రకారును టీవీలకు కట్టిపడేసే మయాంతి లేకపోవడం కొంత వరకు నష్టమే అని స్పోర్ట్స్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొత్తగా వచ్చిన యాంకర్లు ఏ మేరకు ఐపీఎల్ మెగా టోర్నీని క్యారీ చేస్తారో టోర్నీ ప్రారంభం అయితే కానీ తెలియదు.

Story first published: Friday, September 18, 2020, 10:59 [IST]
Other articles published on Sep 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X