బికినీలో మందిరా బేడీ.. ఏం బాడీ.. ఈ వయసులోనూ పిచేక్కిస్తోంది!!

హైదరాబాద్: బాలీవుడ్ నటి, మోడల్ మందిరా బేడీ కామెంటేటర్‌గా భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. మందిరా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. లేటు వయసులోనూ నేటితరం హీరోయిన్లతో పోటీపడి సెక్సీ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ మందిరా బేడీని బికినీలో చూసి అందరూ షాక్ అవుతున్నారు.
నీటిలో మందిరా సాహసాలు:
ఇటీవలే మందిరా బేడీ భర్త రాజ్ కౌషల్, కుమారుడు వీర్‌లతో కలిసి మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లింది. మందిరా అక్కడి జలాల్లో రిఫ్రెష్ అవుతోంది. మందిరా బ్లాక్ బికినీలో కుమారుడుతో కలిసి ఈత కొలనులో స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేసింది. నీటి అడుగున సాహసాలు కూడా చేసింది. ఇప్పటికే తన విహార యాత్రకు సంబందించిన పలు బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన మందిరా.. తాజాగా మరిన్ని ఫొటోలు పంచుకుంది.
బికినీ అందరికీ సెట్ కాదు:
'మాల్దీవులలో ఉన్నప్పుడు అంతా ప్రేమే ఉంటుంది. అందమైన వాటర్-విల్లా, కొలనులో ఉన్నప్పుడు జిమ్‌లో కష్టపడాల్సిన అవసరం లేదు' అని మందిరా రాసుకొచ్చారు. ఫోటోలలో మందిరా బీచ్ ఒడ్డున, స్విమ్మింగ్ పూల్ లాంటి ప్రదేశాలలో పర్ఫెక్ట్ షేప్ బికినీలో కనివిందు చేస్తోంది. బికినీ అందరికీ సెట్ కాదు.. తాను మాత్రమే బికినీ అందాలకు అసలైన చిరునామా అన్నట్లుగా ఉంది.
మందిరా బేడీ.. ఏం బాడీ:
ప్రస్తుతం మందిరా బికినీ ఫొటోలు నెట్టింట్లో మరోసారి వైరల్ అయ్యాయి. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు చేస్తున్నారు. 'గ్రీకు దేవత' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'బ్యూటిఫుల్ బికినీ అని మరొక అభిమాని కామెంట్ చేసాడు. 'హాటెస్ట్ బికినీ పిక్', 'వావ్ మందిరా బేడీ', 'ఏం బాడీ', 'ఈ వయసులోనూ పిచేక్కిస్తోంది' అని మందిరా అందాలను ఆకాశానికెత్తేశారు.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే:
కామెంటేటర్‌గా కాకుండా మందిరా బేడీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇటీవలే 'సాహో' సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం మందిరా వయస్సు 47 సంవత్సరాలు. కానీ.. ఆమె వయసుకు ఫిజిక్‌కు సంబంధం లేదు. మత్తెక్కించే బాడీ షేప్‌తో చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆమెలోని హాట్‌నెస్ కూడా పెరిగిపోతోంది. నేటి తారలకు తానేమీ తక్కువ కాదన్నట్టు హాట్ హాట్ బికినీ ఫొటోలతో అభిమానిలను అలరిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications