Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బిగ్ బాస్ హౌస్‌లోకి తొలి ట్రాన్స్‌జెండర్ అథ్లెట్!

Anaya Bangar: భారత మాజీ క్రికెటర్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్.. లింగ మార్పిడి తర్వాత సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత మహిళా జట్టు తరఫున ఆడాలని కలలు కంటున్న అనయ బంగర్ ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. క్రికెట్‌ను వదిలిపెట్టి అనయ ఇప్పుడు బిగ్‌బాస్ ద్వారా అలరించనుంది. ఆగస్టు 24 నుంచి ప్రారంభమయ్యే బిగ్‌బాస్ 19లో అనయ బంగర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ETimes నివేదిక ప్రకారం.. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రధాన కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్‌.. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో కనిపించనుంది. బిగ్ బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించిన మొదటి ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ అనయ అవుతుంది. అనయ టీమిండియా తరఫున ఆడాలని కోరుకుంటుంది, కానీ ఐసీసీ, బీసీసీఐ ఆమెకు ట్రాన్స్‌జెండర్ కావడం వల్ల మహిళా జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేదు. ఆమె వీడియోలు చేయడం ద్వారా చాలాసార్లు దీని గురించి మాట్లాడింది. అదే సమయంలో, ఆమె బీసీసీఐకి ఒక లేఖ కూడా రాసింది. అనయ ఏమి చేసినా, ఆమె ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది.

Anaya Bangar to Enter Bigg Boss 19 India s First Transgender Athlete in the Reality Show Spotlight

క్రికెట్ ఆడుతూనే ఉండాలని కోరుకుంటున్న అనయ బంగర్
ఐసీసీ, బీసీసీఐకి రాసిన లేఖలో అనయ బంగర్ ఇలా అన్నారు. "మొట్టమొదటిసారికి ట్రాన్స్ ఉమెన్ అథ్లె‌ట్‌గా మారిన నా ప్రయాణానికి సంబంధించిన శాస్త్రీయ రిపోర్టులను అందరికీ చూపిస్తున్నాను. హార్మోన్ థెరపీ ప్రారంభించిన అనంతరం నా శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ రిపోర్టులకు సంబంధించిన డేటా మొత్తం ఉంది. ఈ రిపోర్టును బీసీసీఐ, ఐసీసీకి పంపిస్తున్నాను. ఇది కేవలం నిజాలను చెప్పడం గురించే. ఎవరు అంగీకరించినా, లేకపోయానా పరవాలేదు. థాంక్యూ" అంటూ గతంలో అనయ బంగర్ చెప్పుకొచ్చింది. "సైన్స్ ప్రకారం నేను మహిళల క్రికెట్ ఆడేందుకు అర్హురాలిని. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే.. ప్రపంచం ఈ నిజాన్ని వినడానికి సిద్ధంగా ఉందా?" అంటూ అనయ బంగర్ ప్రశ్నించారు.

అనయ బంగర్ మొదట్లో ఆర్యన్ బంగర్ అనే పేరుతో క్రికెట్ ఆడేది. సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి యువ క్రికెటర్లతో కలిసి జూనియర్ టోర్నమెంట్లలో పాల్గొంది. ఆల్‌రౌండర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం తన నిజమైన గుర్తింపును వెతుక్కుంటూ లింగ మార్పిడికి సిద్ధపడింది. 2021లో అనయ బంగర్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ప్రారంభించి అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది. ఈ మార్పు ఆమె జీవితంలో ఎన్నో సవాళ్లను తీసుకొచ్చింది. ఈ ప్రయాణంలో తనకు వచ్చిన కష్టాలను సోషల్ మీడియా వేదికగా నిర్భయంగా పంచుకుంది. ఈ కఠినమైన ప్రయాణంలో ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. బిగ్ బాస్ వంటి షోలో పాల్గొనడానికి అనయ బంగర్ సరైన వ్యక్తి అని చాలా మంది భావిస్తున్నారు. ఈ షోకు కావలసిన ధైర్యం , నిర్భఊయంగా మాట్లాడే తత్వం ఆమెలో ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ కొత్త ఫార్మాట్‌లో అనయ ఉంటే మరింత ఆసక్తికరంగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

Story first published: Sunday, August 17, 2025, 15:52 [IST]
Other articles published on Aug 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+