Anaya Bangar: భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ విరాట్ కోహ్లీతో తన సంభాషణను గుర్తు చేసుకుంది. తన తండ్రితో పాటు విరాట్ కోహ్లీ దగ్గర శిక్షణ పొందానని చెప్పింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ అనయ బంగర్‌కు బ్యాటింగ్ చిట్కాలు కూడా ఇచ్చినట్లు తాను చెప్పుకొచ్చింది. గతేడాది తన హార్మోన్ల మార్పుల కారణంగా వార్తల్లో నిలిచిన అనయ బంగర్.. విరాట్ కోహ్లీ నుంచి సలహాలు తీసుకున్నానని.. కోహ్లీ తన బలాలపై దృష్టి పెట్టమని ప్రోత్సహించినట్లు చెప్పింది.
విరాట్ కోహ్లీని చాలాసార్లు కలిశాను..
అనయ బంగర్ మాట్లాడుతూ.. "నేను విరాట్ కోహ్లీని చాలా సార్లు కలిశాను. నా తండ్రితో పాటు విరాట్ కోహ్లీ దగ్గర శిక్షణ కూడా పొందాడు. కోహ్లీ నాకు కొన్ని సలహాలు ఇచ్చాడు. నేను బ్యాటింగ్ చేయడం చూశాడు. కోహ్లీ బ్యాటింగ్ చేయడాన్ని దగ్గరగా చూసే అవకాశం నాకు లభించింది" అంటూ అనయ బంగర్ చెప్పుకొచ్చింది.

మ్యాచ్ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారని విరాట్ ను ఒకసారి అడిసారి అడిగినట్లు అనయ బంగర్ తెలిపింది. తమ సొంత బలాలను పూర్తిగా అర్థం చేసుకుని నమ్మే స్థాయి వరకు ప్రాక్టీస్ చేస్తామని విరాట్ కోహ్లీ తనకు చెప్పారని ఆమె వెల్లడించింది. మైదానంల తాము ఏం చేయగలరో వారికి తెలుసన్నారు. వారు దానిని నమ్ముతారని అనయ బంగర్ పేర్కొంది.
బుధవారం మే 14న అనయ బంగర్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె క్రికెట్ ఆడుతున్నట్లు కనిపించింది. ఆమె ఫ్రంట్ ఫుట్ ఆడుతున్నట్లు కనిపించింది. ఆ క్లిప్‌కు క్యాప్షన్ ఇస్తూ ఆమె ఇలా రాసుకొచ్చింది. "నా వద్ద నుంచి ఏదో పెద్ద విషయం రాబోతోందని మీకు తెలియజేస్తున్నాను" అంటూ రాసుకొచ్చింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విషయానికొస్తే.. కోహ్లీ మే 12న టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. టెస్ట్ క్రికెట్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ నాల్గవ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో 2011లో అరంగేట్రం చేశాడు.