IPL 2021: యూఏఈ చేరిన చెన్నై.. విమానాశ్రయంలో మెరిసిన ఎంఎస్ ధోనీ! దుబాయ్‌లో సందడే సందడి!!

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ జరగనుంది. మెగా టోర్నీ ఆరంభానికి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దాంతో అప్పుడే సందడి మొదలైంది. వేదిక యూఈఏకి మారడంతో ఫ్రాంచైజీలన్నీ ముందుస్తుగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నాయి. మూడుసార్లు విజేత చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) శుక్రవారం రాత్రే యూఏఈ చేరుకొంది. ఈ మేరకు చెన్నై ఫ్రాంచైజీ ఓ వీడియోను ట్వీట్ చేసింది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న చెన్నై ప్లేయర్స్ రవీంద్ర జడేజా, మొయిన్ అలీ నేరుగా యూఏఈ చేరుకోనున్నారు.

దుబాయ్‌కి మరోసారి వణక్కం:
సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా, యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సహా ఇతర క్రికెటర్లు, సహాయ సిబ్బంది శుక్రవారం రాత్రి దుబాయ్‌కు చేరుకున్నారు. వారితో పాటు కుటుంబ సభ్యులూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకున్న సీఎస్‌కే 'దుబాయ్‌కి మరోసారి వణక్కం' అని ట్యాగ్ జత చేసింది. ఈ వీడియోలో సీఎస్‌కే బస చేస్తున్న హోటల్, ఎంటర్‌టైన్‌మెంట్ గదిని చూపించారు.

రెండో స్థానంలో సీఎస్‌కే:
సీఎస్‌కే సహాయ కోచ్‌లైన లక్ష్మీపతి బాలాజీ, మైక్ హస్సీ సహా ఇతర ఫ్రాంచైజీ ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకడంతో ఈ సీజన్ వాయిదాపడిన సంగతి తెలిసిందే. గతేడాది చిత్తుగా ఓడిపోయిన సీఎస్‌కే ఈ సారి మంచి ఫామ్‌లోనే కనిపించింది. ఐదు మ్యాచులు గెలిచి రెండింట్లోనే ఓడింది. పట్టికలో సీఎస్‌కే రెండో స్థానంలో ఉంది. ధోనీసేన మరో రెండు మ్యాచులు గెలిచారంటే.. సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఖాయమే. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19న సీఎస్‌కే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

బ్యాటింగ్‌లో ధోనీ ఫెయిలైనా:
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన ఎంఎస్ ధోనీ 12.33 సగటుతో కేవలం 37 పరుగులే చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటీ కూడా ఆడలేదు. దాంతో మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా మహీ చెలరేగాలని చెన్నై అభిమానులు ఆశిస్తున్నారు. ఆ ఏడు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో ధోనీ ఫెయిలైనా.. కెప్టెన్, వికెట్ కీపర్‌గా మాత్రం అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్ 14వ సీజన్ వాయిదాపడే సమయానికి చెన్నై పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) ఆరు విజయాలతో ఉండగా.. మూడో స్థానంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు), నాలుగులో ముంబై ఇండియన్స్ (8 పాయింట్లు) ఉన్నాయి.

గతేడాదే రిటైర్మెంట్:
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చివరగా 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో 18 పరుగుల తేడాతో కోహ్లీసేన ఓటమిపాలైంది. అదే మహీకి చివరి మ్యాచ్ అని అప్పుడు ఎవరూ కూడా ఊహించలేదు. ఆ మ్యాచ్ జరిగిన ఏడాదికి మహీ ఆటకు వీడ్కోలు చెప్పాడు. గతేడాది ఆగష్టు 15న ధోనీ రిటైర్మెంట్ ఇచ్చాడు. దీంతో యావత్ క్రీడాలోకం ఒక్కసారిగా ఆచర్యపోయింది. అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10773 రన్స్ చేశాడు. 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1600 పరుగుల బాదాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications