Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నమ్మలేని నిజం: 'గెలుస్తామని అస్సలు ఊహించలేదు'

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తాము గెలుస్తామని అస్సలు ఊహించలేదని కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ క్రిస్ వోక్స్ అభిప్రాయపడ్డాడు. బెంగళూరుని నైట్‌రైడర్స్‌ చిత్తుచిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే.

132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరును నాథన్ కౌల్టర్‌-నైల్‌ (3/21), క్రిస్‌వోక్స్‌ (3/6), గ్రాండ్‌హోమ్‌ (3/4), ఉమేశ్‌ (1/15) వికెట్లు తీసి ఘోరంగా దెబ్బకొట్టారు. మ్యాచ్ అనంతరం క్రిస్ వోక్స్ మీడియాతో మాట్లాడాడు.

'స్వల్ప లక్ష్యాన్ని ముందుంచిన మేము బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూరుతో గెలవడం కష్టంగా భావించామన్నాడు. అయితే కెప్టెన్ గంభీర్ ఇచ్చిన స్పూర్తి మాలోని పోరాట పటిమను పెంచింది. ముందుగా వేసిన బౌలర్లు త్వరగా వికెట్లు తీయడంతో తర్వాతి బౌలర్లకు సులభమైంది' అని వోక్స్ అన్నాడు.

An unbelievable win - Woakes

'అప్పట్నుంచి మేం సరైన ప్రాంతాల్లో బంతులు వేశాం. కౌల్టర్‌-నైట్‌, ఉమేశ్‌ బంతిని స్వింగ్‌ చేశారు. నేను స్వింగ్‌ చేయకుండా ఆఫ్‌సైడ్‌ సరైన ప్రాంతాల్లో బంతులేశా. వికెట్లు పడుతున్నప్పుడు అలాంటి బంతులు బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోకి నెట్టేస్తాయి' అని వోక్స్ తెలిపాడు.

ముఖ్యంగా క్రిస్ గేల్, కోహ్లీ, డివిలియర్స్ అవుట్ అవ్వడంతో మ్యాచ్‌పై ఆశలు కలిగాయని వోక్స్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ లో వోక్స్ 2-0-6-3 తో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ మ్యాచ్‌లో వోక్స్ గేల్, బిన్నీ, శ్యాముల్ బద్రీలను పెవిలియన్‌కు చేర్చాడు.

కౌల్టర్-నైల్, గ్రాండ్ హోమ్‌లకు మూడేసి వికెట్లు దక్కగా ఉమేశ్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 49 పరుగులకే ఆలౌటైంది. దీంతో పదేళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది.

అనంతరం 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 9.4 ఓవర్లలో 49 పరుగులకు ఆలౌటైంది. ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోవడం ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 82 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+