For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PCB: భారత్ సహాయం లేకుంటే పాకిస్థాన్ క్రికెట్ కుప్పకూలిపోవచ్చు.. వైరల్ అవుతున్న రమీజ్ రాజా వీడియో..

An old video of PCB president Rameez Raja is going viral on social media

2023 ఆసియా కప్ కోసం మెన్ ఇన్ బ్లూ పాకిస్థాన్ లో ప్రయాణించబోమని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) జై షా ప్రకటించారు."ఆసియా కప్ 2023 తటస్థ వేదికపై జరుగుతుంది. ACC అధ్యక్షుడిగా నేను ఈ విషయం చెబుతున్నాను. మేము అక్కడికి వెళ్లలేము, వారు ఇక్కడకు రాలేరు. గతంలో కూడా ఆసియా కప్‌లో తటస్థ వేదికపై ఆడారు" అని షా అన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) కూడా తమ నిరాశను వ్యక్తం చేసింది. బుధవారం మధ్యాహ్నం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

90 శాతం
ఈ నేపథ్యంలో పీసీబీ ప్రెసిడెంట్ రమీజ్ రాజా పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీడియోలో రాజా ప్రపంచ క్రికెట్‌లో భారత్ ప్రాముఖ్యతను వివరిస్తూ, వారి మద్దతు లేకుండా పాకిస్తాన్ క్రికెట్ 'కుప్పకూలిపోవచ్చు' అని మాట్లాడడం వీడియోలో వినవచ్చు. "పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 50 శాతం ఐసిసి నిధులపై నడుస్తుంది.ఐసిసి నిధులకు భారత మార్కెట్ 90 శాతం సహకరిస్తుంది. కాబట్టి భారతీయ వ్యాపార సంస్థలు పాకిస్తాన్ క్రికెట్‌ను నడుపుతున్నాయి. రేపు భారత ప్రధాని పాకిస్థాన్‌కు ఎలాంటి నిధులు మంజూరు చేయకూడదని నిర్ణయించుకుంటే ఈ క్రికెట్ బోర్డు కుప్పకూలవచ్చు'' అని రాజా వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది.

2006లో
2008లో ముంబై దాడి జరిగినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. మెన్ ఇన్ బ్లూ చివరిసారిగా 2006లో పాకిస్థాన్ లో పర్యటించింది. ఆ తర్వాత వరల్డ్ కప్ ల్లో మాత్రమే పాక్ తో భారత్ ఆడుతోంది. పాకిస్థాన్ లో శ్రీలంక జట్టుపై దాడి జరిగిన తర్వాత ఇటీవలే పలు దేశాలు పాకిస్థాన్ లో పర్యటిస్తున్నాయి.

Story first published: Wednesday, October 19, 2022, 20:18 [IST]
Other articles published on Oct 19, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+