భారత్‌లో క్రికెట్ అంటే జస్ట్ క్రీడ మాత్రమే కాదు. అదొక ఎమోషన్. తిండీ తిప్పలు లేని వాళ్లు కూడా క్రికెట్ అంటే ప్రాణం ఇస్తారు. దీనికి నిదర్శనంగా తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియోను చూపించవచ్చు. ఒక ముసలి తాత రోడ్డుపై వెళ్తున్నాడు. కాసేపటికే రోడ్డుపై నిలబడిపోయాడు.
తన లోకంలోకి వెళ్లిపోయి క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. తన వైపు వచ్చిన బౌన్సర్‌ను భారీ సిక్సర్ బాదాడు. ఇలా బంతి కూడా లేకుండా ఆ తాత సిక్సర్ బాదడాన్ని కొందరు తమ మొబైల్‌లో వీడియో తీసి నెట్టింట షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భారత్‌లో క్రికెట్ ఎంత పాపులరో ఈ వీడియో చెప్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

మనం ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా పిల్లలు క్రికెట్ ఆడటం కనిపిస్తూనే ఉంటుంది. అంతేకాదు, చేతిలో బంతి లేకపోయినా బౌలింగ్ చేసే వాళ్లు, బ్యాటు లేకపోయినా బ్యాటింగ్ చేసే వాళ్లు కనిపిస్తూనే ఉంటారు. ఈ తాత కూడా అలాంటి వారిలో ఒకడనే చెప్పాలి. ఏదేమైనా ఈ తాత క్రికెట్ షాట్ మాత్రం బాగా పాపులర్ అయింది.
ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఆ తాతను తెగ మెచ్చుకుంటున్నారు. ఈ తాత పర్‌ఫెక్స్ పోజ్‌లో ఈ షాట్ కొట్టాడని కొనియాడుతున్నారు. బాగా ఈ షాట్ ప్రాక్టీస్ చేసి ఉంటాడని అంటున్నారు. మరికొందరేమో.. ఈ తాతను కూడా ఏదో ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీలోకి తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
వచ్చే ఐపీఎల్‌లో తాతను కూడా వేలంలో పెట్టాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. సన్‌రైజర్స్ వంటి టీమ్స్‌కు అతను బాగా ఉపయోగపడతాడని జోకులు పేలుస్తున్నారు. అయితే ఈ తాత ఎక్కడి వాడు? ఈ వీడియో ఎక్కడ తీశారు? అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.