For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'శ్రీలంక టెస్టు జట్టుని భారత రంజీ జట్టు ఓడిస్తుందేమో?'

By Nageshwara Rao

హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత జట్టుతో తలపడుతున్న శ్రీలంక టెస్టు జట్టు ఆటతీరుపై భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత శ్రీలంక టెస్టు జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోందని, ఆ జట్టుని భారత్‌లోని రంజీ టీమ్ అలవోకగా ఓడించేలా ఉందని పేర్కొన్నారు.

'నిజం చెప్పాలంటే పల్లెకలెలో జరుగుతున్న మ్యాచ్‌ని టెస్టు మ్యాచ్‌ అని సంబోధించకూడదు. శ్రీలంక జట్టు భారత్‌కి ఏమాత్రం పోటీనివ్వలేకపోతోంది. పేలవ ప్రదర్శన చేస్తున్న ఈ లంక జట్టుని భారత్‌లోని రంజీ జట్టు ఓడించేస్తుందేమో' అని గవాస్కర్ నిరాశ వ్యక్తం చేశాడు.

బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ శ్రీలంక విఫలమైందని హార్దిక్ పాండ్యా హిట్టింగ్‌కి వారి బౌలర్ల దగ్గర సమాధానమే లేకపోయిందని గవాస్కర్ పేర్కొన్నాడు. ఈ సిరిస్ మొత్తం చాలా చప్పగా సాగుతోంది. కనీసం ఆగస్టు 20 నుంచి జరగనున్న వన్డే సిరీస్‌లోనైనా శ్రీలంక పుంజుకుంటుందేమో చూడాలని గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

An elite Ranji team can defeat present Sri Lanka Test team, feels Sunil Gavaskar

ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓటమి పాలైన శ్రీలంక పల్లెకెలె వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో కూడా నిరాశపరిచింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేయగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన శ్రీలంక 135‌కే కుప్పకూలిపోయింది.

అనంతరం ఫాలో‌ఆన్ ఆడిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది. తద్వారా మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+