అర్ధరాత్రి హంగామా: క్రికెటర్ షమీ భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హాసిన్ జహాన్ గతేడాది కాలంగా వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. షమీ తనను మానసికంగా హింసిస్తున్నాడని, చంపేందుకు కూడా ప్రయత్నించాడని గతంలో హాసిన్ జహాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు షమీపై వరకట్నం వేధింపుల కేసు కూడా పెట్టడంతో అతడిపై ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
తాజాగా ఆదివారం రాత్రి షమీ ఇంటికి వెళ్లి గొడవకు దిగిందన్న కారణంతో హసీన్ జహాన్‌ను అమ్రోహ పోలీసులు అరెస్టు చేశారు. టైమ్స్ నౌలో వచ్చిన కథనం ప్రకారం ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని సహాస్‌పూర్ అలీనగర్ గ్రామంలో ఉన్న షమీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన హసీన్ జహాన్, షమీ తల్లితో గొడవకు దిగింది.

పోలీసులకు సమాచారం
దీంతో వెంటనే షమీ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి హాసిన్ జహాన్ కూతురితో సహా తనను తాను ఓ గదిలో బంధించుకుంది. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెపై 151 సెక్షన్ కింద కేసు నమోదు చేసి హసీన్ జహాన్‌ను అరెస్టు చేశారు.

బెయిల్‌పై విడుదల
ఆ తర్వాత కొద్ది సేపటికే ఆమెను బెయిల్‌పై పోలీసులు విడుదల చేయడం విశేషం. తన అరెస్ట్‌పై హాసిన్ జహాన్ మాట్లాడుతూ "నేను నా భర్త ఇంటికి వచ్చాను. ఇక్కడ ఉండేందుకు నాకు సర్వహక్కులు ఉన్నాయి. కానీ మా అత్తింటివాళ్లు నాతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు" అని పేర్కొంది.

పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న షమీ
ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో మహ్మద్ షమీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. తన ప్రదర్శన ఆధారంగా మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ జట్టులో సైతం చోటు దక్కించుకున్నాడు.

షమీ పేరు అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫారసు
గతేడాది మహ్మద్ షమీ చక్కటి ప్రదర్శన చేయడంతో బీసీసీఐ అర్జున అవార్డుకి కూడా సిఫారసు చేసింది. ఆస్ట్రేలియా సిరిస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో బుమ్రా 21 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. మరో బౌలర్ షమీ సైతం టీమిండియాలో మెరుగ్గా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియాతొ సొంతగడ్డపై జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో అద్భు ప్రదర్శన చేశాడు. మొత్తం నాలుగు మ్యాచ్‌లాడిన షమీ 5 వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications