For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ మెడకు అమ్రపాలి ఉచ్చు.. ఎఫ్‌ఐఆర్ నమోదు!!

MS Dhoni Under Serious Trouble After People Register FIR ! || Oneindia Telugu
Amrapali Group buyers name MS Dhoni in FIR, accuse him of being part of criminal conspiracy

ఢిల్లీ: ఆమ్రపాలి రియ‌ల్ ఎస్టేట్ సంస్థ స్కామ్‌ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మెడకు చుట్టుకొనే ప్రమాదం ఉంది. నేరపూరిత కుట్రలో ధోనీకి కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించిన ఆమ్రపాలి గ్రూప్‌ బాధితులు.. ఎఫ్‌ఐఆర్‌లో మహీ పేరును కూడా చేర్చారు. దీంతో ధోనీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. ఎకనామిక్ అఫెన్స్ వింగ్‌లో గృహ యజమానులు ఇప్పటివరకు ఏడు ఎఫ్‌ఐఆర్‌లను దాఖలు చేసినట్లు సమాచారం తెలుస్తోంది.

ఎఫ్‌ఐఆర్ నమోదు:

ఎఫ్‌ఐఆర్ నమోదు:

'క్రికెటర్‌గా ఎంఎస్ ధోనీకి, బిల్డర్‌గా అనిల్‌ శర్మకు దేశంలో ఎంతో పేరుంది. ఈ ఇద్దరిపై ఉన్న నమ్మకంతోనే ఆమ్రపాలిలో ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు చెల్లించాం. నేరపూరిత కుట్రలో ధోనీ కూడా భాగమే. ఎఫ్‌ఐఆర్‌లో అతని పేరును కూడా చేర్చాము' అని సదరు భాధితులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సోమవారం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించే అవకాశం ఉంది.

 అనేక కంపెనీలకు నిధుల మల్లింపు:

అనేక కంపెనీలకు నిధుల మల్లింపు:

ఆమ్రపాలి రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌నకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించాడు. 2009 నుంచి 2016 వ‌ర‌కు కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. అయితే ఫ్లాట్‌లు విక్రయిస్తామంటూ అనేక మంది వద్ద సొమ్ములు సేకరించిన సంస్థ.. ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా అనేక కంపెనీలకు మళ్లించింది. ఇందులో ధోనీ భార్య సాక్షికి చెందిన కంపెనీ కూడా ఉంది.

జైలుకు ఆమ్రపాలి డైరెక్టర్లు:

జైలుకు ఆమ్రపాలి డైరెక్టర్లు:

డిపాజిట్లు తీసుకున్న ఆమ్రపాలి కంపెనీ అగ్రిమెంట్‌ ప్రకారం ఓనర్లకు ఫ్లాట్లు అప్పజెప్పలేదనే ఫిర్యాదులు అందడంతో.. 2017లో సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. ఆమ్రపాలి సంస్థ ప్రజల డబ్బును వివిధ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు బదిలీ చేసినట్టు తేలింది. ప్రజలను మోసం చేసిన కేసులో ఆమ్రపాలి డైరెక్టర్లను జైలుకు కూడా పంపింది.

రూ.40 కోట్లు చెల్లించలేదు:

రూ.40 కోట్లు చెల్లించలేదు:

2009 నుంచి 2016 వ‌ర‌కు కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు తనకు చెల్లించాల్సిన రూ.40 కోట్ల బకాయిలను ఆమ్రపాలి గ్రూప్‌ చెల్లించలేదని గత ఏప్రిల్ నెలలో ధోనీ కోర్టుకు నివేదించాడు. మరోవైపు రాంచీలోని ఆమ్రపాలి సఫారిలో పెంట్‌హౌస్‌ను తాను బుక్‌ చేసుకున్నానని.. ఇంతవరకూ పెంట్‌హౌస్‌ను తనకు అప్పగించలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ధోనీతో జరిగిన అన్ని లావాదేవీల వివరాలను తమకు నివేదించాలని సుప్రీం కోర్టు ఆమ్రపాలి గ్రూప్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.

Story first published: Monday, December 2, 2019, 12:11 [IST]
Other articles published on Dec 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+