గౌరవం: భారత్-పాక్ మ్యాచ్‌లో బిగ్ బీ జాతీయగీతం
కోల్‌కత్తా: ఐసీసీ వరల్డ్ టీ20లో భాగంగా ప్రతిష్టాత్మక భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధానాకర్షణ కానున్నాడు. టోర్నీలో భాగంగా మార్చి 19న కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు అమితాబ్ జాతీయ గీతాన్ని ఆలపించనున్నాడు.
ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ విజ్ఞప్తి మేరకు అమితాబ్ దీనికి అంగీకరించినట్టు క్యాబ్ వర్గాలు తెలిపాయి.
భారత్‌లోనే అతి పెద్ద స్టేడియంగా పేరుగాంచిన ఈడెన్ గార్డెన్స్‌లో క్రికెట్ అభిమానుల ముందు అమితాబ్ తన గాంభీర్యమైన కంఠంతో జాతీయ గీతం పాడిన తర్వాత భారత్-పాక్ మ్యాచ్ మొదలవనుంది. కాగా పాకిస్థాన్ క్లాసికల్ సింగర్ షఫాకత అమనత అలీ పాక్ జట్టు తరుపున ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపిస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications