కోహ్లీకి గాలిలో ముద్దులు: అనుష్క శర్మని ఆటపట్టించిన అమితాబ్

హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్వవహారిస్తోన్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ కార్కక్రమానికి గెస్ట్‌గా వచ్చిన అనుష్క శర్మపై అమితాబ్ బచ్చ్ వేసి సెటైర్ ఆమెను కడుపుబ్బ నవ్వేలా చేసింది.
అనుష్క నటించిన తాజా చిత్రం సూయి దాగా. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం శరత్ కఠారియా దర్శకత్వంలో రూపొందించబడింది. సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తమ సినిమా ప్రమోషన్ కోసం కౌన్ కనేగా కరోడ్ పతి ప్రమోషన్‌కి హీరో వరుణ్ ధావన్‌తో పాటు హీరోయిన్ అనుష్క శర్మ సైతం హాజరయ్యారు.

కంటెస్టెంట్ పక్కనే కూర్చున్న అనుష్క శర్మ
కార్యక్రమంలో భాగంగా అమితాబ్ ముందున్న హాట్ సీట్‌లో కంటెస్టెంట్ కూర్చుని ఉంటుంది. ఆమె పక్కనే అనుష్క శర్మ కూడా కూర్చుని ఉంటుంది. ఈ సమయంలో కంటెస్టెంట్‌తో మీరు క్రికెట్ చూస్తారా? అని అడుగుతాడు అమితాబ్. అందుకు ఆమె చూసే సమయం లేదని చెబుతుంది.

నా భర్త క్రికెటర్, అందుకే క్రికెట్ చూస్తుంటా
ఇంతలో అమితాబ్ కంటెస్టెంట్ పక్కనే కూర్చిని ఉన్న అనుష్క క్రికెట్ చూస్తుందని మా అందరికి తెలుసు అంటాడు. అప్పుడు ఆ అనుష్క ఆ యువతికి నా భర్త క్రికెటర్, అందుకే క్రికెట్ చూస్తుంటానని చెబుతుంది. దీనికి అమితాబ్ కేవలం అతనిని చూసేందుకే మ్యాచ్ వెళతావా అని అనుష్కని అడగగా, అలాంటిదేమి లేదు. మన జట్టుని సపోర్ట్ చేసేందుకు అని సమాధానమిస్తుంది.
అనుష్క శర్మని ఆటపట్టించిన అమితాబ్
ఈ క్రమంలో అమితాబ్ అనుష్కని ఆటపట్టిస్తూ టీవీలో ఏం జరుగుతుందో అందరికి తెలుసు. మైదానంలో ఉన్న విరాట్ కోహ్లీకి ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తూ ప్రేక్షకులని ఎంత ఎంటర్‌టైన్ చేస్తావో చూస్తూనే ఉన్నాం అని అనడంతో అనుష్క శర్మ ఒక్కసారిగా పగలబడి నవ్వుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆసియా కప్ నుంచి కోహ్లీకి విశ్రాంతి
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్‌పై నాటింగ్ హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ సెంచరీ పూర్తి చేసిన వెంటనే స్టేడియంలో కూర్చుని మ్యాచ్‌ను తిలకిస్తున్న భార్య అనుష్కశర్మను చూస్తూ ఫ్లైయింగ్ కిస్‌లు విసిరాడు. దీంతో అనుష్క శర్మ నిలబడి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపింది. భర్త ఇచ్చిన ముద్దులకు ప్రతిగా ఆమె కూడా ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీ నుంచి విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications