For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అమితాబ్‌ మీకిది తగునా?: ముంబై ఓడిపోతుందని టీవీ కట్టేస్తారా?

బాలీవుడ్‌తో పాటు యావత్ భారతదేశం అమితంగా ప్రేమించే నటుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. అలాంటి అమితాబ్ బచ్చన్ కూడా క్రికెట్ లాంటి విషయాలకు వచ్చేసరికి ఎంత సంకుచితంగా వ్యవహరిస్తాడో ఐపీఎల్ సాక్షిగా నిరూపితమైంది.

By Nageshwara Rao

హైదరాబాద్: బాలీవుడ్‌తో పాటు యావత్ భారతదేశం అమితంగా ప్రేమించే నటుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. అలాంటి అమితాబ్ బచ్చన్ కూడా క్రికెట్ లాంటి విషయాలకు వచ్చేసరికి ఎంత సంకుచితంగా వ్యవహరిస్తాడో ఐపీఎల్ సాక్షిగా నిరూపితమైంది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

హైదరాబాద్ వేదికగా రైజింగ్ పూణెతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ విజేతగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ కూడా కసిని ప్రదర్శిస్తూ ఆ గెలుపుపై సంకుచిత ప్రకటన చేశారు.

టీమిండియాకు అమితాబ్ పెద్ద ఫ్యాన్. ఐపీఎల్‌లో మాత్రం ముంబై ఇండియన్స్‌ వీరాభిమాని. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తక్కువ స్కోరు చేయడంతో తన అభిమాన జట్టు ఓడిపోతుందని నిరాశగా టీవీ కట్టేశారంట. ఆ తర్వాత తన కుమారుడు ఫోన్‌ చేసి ముంబై గెలించిందనేసరికి ఆశ్చర్యపోయారట.

Amitabh Bachchan switched off his TV half way through the IPL final

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులు చేయడం అమితాబ్‌కు రుచించలేదు. అందుకే ఇన్నింగ్స్‌ బ్రేక్‌ తర్వాత కట్టేసిన టీవీవైపు మళ్లీ కన్నెత్తి చూడలేదంట. మ్యాచ్ అనంతరం అభిషేక్‌ బచ్చన్‌ సమాచారంతో సంతోషించిన ఆయన ట్విట్టర్‌లో ఆ అనుభూతిని డైలాగ్‌తో పంచుకున్నారు.

'తుమ్‌ అపున్‌ కో దస్‌ మారా. అపున్‌ ఏక్‌ మారా... పర్‌ సాలిడ్‌ మారా' (మీరు మమ్మల్ని పదిసార్లు కొట్టారు. కానీ మేం ఒక్కసారే మిమ్మల్ని కొట్టాం. అదరగొట్టాం) అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+